ప్రభాతదర్శిని,(తొట్టంబేడు-ప్రతినిధి):శ్రీకాళహస్తి లో ఉన్న ఇన్ఫినిటీ ఫిన్ కార్ప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబై వారు సిఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా కన్నలి పాఠశాలలకు అవసరమైన దాదాపు ఒక్క లక్ష యాభైవేల విలువచేసే కుర్చీలు, టేబుల్స్, బీరువాలు ,వాటరు ఆర్వో సిస్టం ,మరియు విద్యార్థులకు అవసరమైన అట్టలు ,జామెంట్రీ బాక్సులు, సామాగ్రి ఉచితంగా పంపిణీ చేశారు .ఈ సంస్థ ఇండియాలో ఏడు రాష్ట్రాలలో హౌసింగ్ లోన్ ద్వారా పేద ప్రజల రుణ బాధలను తీరుస్తూ మరియు ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. సంస్థ సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ రవల్కర్ మరియు రీజనల్ సేల్స్ మేనేజర్ మోహన్, మురళి, శివ ముఖ్య అతిథి గా తొట్టంబేడు ఎంపీడీవో సురేంద్రనాథ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో దాత శ్రీకాంత్ రావల్కర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ మెరుగ్గా రాణించి ఉన్నతమైనటువంటి స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సంస్థ సీఈఓ గారు వివిధ ప్రాంతాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవయ్య, స్రవంతి మరియు గీత పాల్గొన్నారు.