ప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కార్యదర్శిగా నియమితులైన ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్. ఎం. హరి జవహర్లాల్ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాననీయ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయిన గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో గవర్నర్ కార్యదర్శిగా డాక్టర్ హరి జవహర్లాల్ నియమితులయ్యారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న డాక్టర్. హరి జవహర్‌లాల్‌కు గవర్నర్ సంయుక్త కార్యదర్శి పి.ఎస్. సూర్యప్రకాష్, ఉప కార్యదర్శి పి. నారాయణ స్వామి, గవర్నర్ ఎడిసిలు మేజర్ దీపక్ శర్మ, రామాంజనేయులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు డాక్టర్ హరి జవహర్‌లాల్‌కు ఆశీర్వచనం అందజేశారు. రాజ్‌భవన్ అధికారులు మరియు సిబ్బంది డాక్టర్ హరి జవహర్‌లాల్‌ను కలిసి అభినందనలు తెలిపారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.