ఎస్‌టిల ఆర్థిక పరిపుష్టికి ప్రాధాన్యత: కలెక్టర్ ఒ. ఆనంద్
ప్రభాతదర్శిని ( నెల్లూరు-ప్రతినిధి): నెల్లూరు: జిల్లాలో 2024-2025 ట్రైబల్ వెల్ఫేర్ సబ్ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసేందుకు ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ట్రైబల్ వెల్ఫేర్ సబ్ ప్లాన్ అమలుకు శాఖలవారీగా పొందుపరచాల్సిన నివేదికపై కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్‌టిల పరిపుష్టి కోసం ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆయా శాఖల్లో కేటాయింపులు చేయాలని సూచించారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఎస్టీలకు ప్రయోజనాలు సమకూర్చడం, ఎస్‌టిల హెబిటేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ ఎస్‌టిల ఆర్థిక బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లు, ఇళ్ల నిర్మాణాలు, తాగునీరు, విద్య, ఉపాధి కల్పన మొదలైన అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. ప్రధానంగా డ్వామా, డిఆర్డిఎ, ఆర్‌డబ్ల్యుఎస్, పిఆర్, ఆర్ అండ్ బి, పశు సంవర్థక, వ్యవసాయ, ఉద్యానవనశాఖ, ఐసిడిఎస్శాఖల ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల్లో ఎస్టీలకు అధికంగా ప్రయోజనం కల్పించేలా సబ్ ప్లాన్‌ను రూపొందించాలని సూచించారు. ఆయాశాఖల్లో కేటాయింపులతో పాటు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ద్వారా మంజూరు చేసిన కేటాయింపులతో ఎస్టీల ఆర్థిక స్వావలంబనకు కృషి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. మూడు రోజుల్లో ట్రైబల్ వెల్ఫేర్ సబ్ ప్లాన్ కు సంబంధించిన కేటాయింపుల నివేదికను తయారుచేసి ఐటీడీఏ అధికారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పివో పరిమళ, జడ్పీ సిఇవో కన్నమనాయుడు, డిఆర్డిఎ, డ్వామా, ఐసిడిఎస్, హౌసింగ్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు సాంబశివారెడ్డి, శ్రీనివాసులు, దయాకర్, రవీంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, ఉద్యానవనశాఖాధికారి సుబ్బారెడ్డి, డిఎంఅండ్‌హెచ్‌వో పెంచలయ్య, ఆర్అండ్బి, విద్యుత్‌శాఖల ఎస్ఈలు గంగాధర్, విజయన్, సిపివో రాజు, డీఈవో రామారావు, సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.
ట్రైబల్ వెల్ఫేర్ సబ్ ప్లాన్‌ను పక్కాగా అమలుచేయాలి
Related Posts
అట్టహాసంగా ప్రారంభమై… అంగరంగ వైభవంగా… ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు
ముగింపు కార్యక్రమ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి అనగాని సత్యప్రసాద్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, పర్యాటక రంగ అభివృద్ధికి, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది మంచి ప్రభుత్వం అని మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమ ముగింపు వేడుకలకు రాష్ట్ర…
Read moreఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు
ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులుజన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణంవివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత ప్రభాతదర్శిని ( సూళ్లూరుపేట-ప్రతినిధి ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో కిక్కిరిసిన జనం కేరింతలతో ఉత్సాహంగా…
Read more