ప్రభాతదర్శిని, (ఏలూరు-ప్రతినిధి): ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఎస్ టి ఎఫ్ బృందం, జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్ ఎస్ ఎచ్ ఓ కలిసి ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలంలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో, మారుతి వాన్ (AP 39 TV 2190) ద్వారా సరఫరా అవుతున్న రెండు అక్రమ మద్యం విక్రయ కేంద్రాలను అధికారులు గుర్తించి భగ్నం చేశారు. నిందితుల ఒప్పుకోలు ఆధారంగా, మద్యం సరఫరా చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అప్పేరు వైన్ షాప్ కూడా ఈ కేసులో నిందితుల జాబితాలో చేర్చబడింది. ఈ ఘటనపై క్రైమ్ నంబర్లు 32/25 మరియు 33/25 కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, 22 (180 మిల్లీ లీటర్ల) మద్యం సీసాలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.