ప్రభాతదర్శిని, (దిల్లీ ప్రత్యేక-ప్రతినిధి): రోగులకు ముప్పుతెచ్చే అవకాశం ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం 156 రకాల ఔషధాలను నిషేధించింది. వీటిని ప్రధానంగా జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు మందులుగా వాడుతుంటారు. స్థిర మోతాదులో రెండు, అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే మందులను (కాంబినేషన్ డ్రగ్స్‌ను) కాక్టెయిల్ డ్రగ్స్ అని కూడా వ్యవహరిస్తారు. ఎసెక్లోఫెనాక్ 500 ఎంజీ + పారాసెటమాల్ 125 ఎంజీ మాత్రలను, మెఫెనమిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్, సెట్రిజెన్ హెచ్‌సీఎల్+ పారాసెటమాల్+ ఫినైలెప్రైన్ హెచ్‌సీఎల్, లెవొసెట్రిజిన్+ ఫినైలెప్రైన్ హెచ్‌సీఎల్+ పారాసెటమాల్ వంటివి నిషేధిత మందుల జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉండగా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాలను వాడడం ప్రమాదాన్ని ఆహ్వానించడమే అవుతుందని అందులో పేర్కొన్నారు.
156 ఔషధాలపై కేంద్రం నిషేధం… జాబితాలో జ్వరాలు, నొప్పులు, ఎలర్జీలకు వాడే మందులు
Related Posts
ఏ.సి.బి వలకు చిక్కిన అవినీతి అనకొండ
మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…
Read moreBC లోని ప్రస్తుతం కులాలు
BC- A కులాలు : . 1.అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడ బలిజ, బెస్త, జాలరి, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి, నెయ్యల, పట్టపు, ముదిరాజు, ముత్రాసి తెనుగోళ్ళు బాలసంతు, బహురూపి 3. బండార 4. బుడబుక్కల 5. రజక, చాకలి, వన్నార్. 6. దాసరి 7. దొమ్మర 8.గంగిరెద్దుల 9. జంగం10. జోగి 11. కాటిపాపల 12. కొర్చ 13.…
Read more