ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తోపాటు పాలక మండల సభ్యులు రైతుల సంక్షేమానికి కృషి చేయాలని , రాష్ట్ర హస్త కళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. నాయుడుపేట పట్టణంలోని ఏఎంసీ కార్యాలయ ఆవరణలో బుధవారం జరిగిన ఏఎంసీ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తో కలిసి పాల్గొన్నారు. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఏ రాజకీయ సంబంధం లేని వ్యక్తులకు ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మాట నిలబెట్టుకుంటున్నారని తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేసి,నిజాయితీగా ప్రజలకు సేవ చేసే వారికి పదవులు ఇస్తున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి ఉయ్యాల ప్రవీణ్ ను కూటమి నుండి నాయుడుపేట ఏఎంసీ చైర్మన్గా నియమించడం జరిగిందన్నారు.నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు.నూతన ఏఎంసీ పాలక మండల కి శుభాకాంక్షలు తెలియజేశారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ కూటమి నాయకులు,కార్యకర్తలు అందరూ ఐక్యంగా పనిచేసి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వైసీపీ పాలనలో ఏ తప్పు చేయని సీఎం చంద్రబాబు పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని, వైసిపి పాలనకు అంతం పలకాలని, ఎన్నికలలో ఓట్లు చీలిక లేకుండా ఉండేవిధంగా చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ తన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. అలాగే జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి ఉయ్యాల ప్రవీణ్ తనను సొంత చెల్లెలు లాగా భావించి కూటమి అభ్యర్థి అయిన తన గెలుపుకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు.కూటమి పాలనలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏఎంసీ పాలకమండలి కి శుభాకాంక్షలు తెలియజేశారు. కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అభివృద్ధి,సంక్షేమమే అజెండాగా పనిచేసి కూటమి ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలని ఏఎంసీ పాలకమండలికి సూచించారు. తొలుత నాయుడుపేట ఏఎంసి చైర్మన్ గా ఉయ్యాల ప్రవీణ్ ప్రమాణ స్వీకారం చేశారు.అలాగే పాలకమండల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం, నాయుడుపేట ఏఎంసీ మాజీ చైర్మన్ శిరసనం భేటీ విజయభాస్కర్ రెడ్డి, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ,ఏఎంసి వైస్ చైర్మన్ కే గోపాల్,శ్రీకాళహస్తి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్,పెళ్లకూరు ఓజిలి మండలాల టిడిపి అధ్యక్షులు సంచి కృష్ణయ్య, విజయ్ కుమార్ నాయుడు,కురుగొండ పీఏసీఎస్ అధ్యక్షులు దారా అంకయ్య, మొండెం బాబు, ఏఎంసీ డైరెక్టర్లు,కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

