ప్రభాతదర్శిని,(నాయుడుపేట- ప్రతినిధి):: నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్ లో జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని సూళ్లూరుపేట ఇన్చార్జ్, నాయుడుపేట ఏ ఎం సీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ లు ప్రారంభించారు.ఈ సందర్భంగా హస్తకళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ నిబద్దలతో పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేసిన ఉయ్యాల ప్రవీణ్ సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని అన్ని అంగులతో ఏర్పాటు చేయడం అభినందనీయమని, కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అట్లా కృష్ణారావు,నాయకులు గిండి సతీష్,బాలుశెట్టి, పలువురు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు.