అక్రమ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు: షాద్ నగర్ ఆర్డీఓ ఎన్ ఆర్ సరిత వెల్లడి
ప్రభాతదర్శిని, ( హైదరాబాద్-ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామంలో అక్రమ రిజిస్ట్రేషన్ లతో పట్టా మార్పిడి చేసుకున్న ఉదంతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి బాధిత రైతులకు న్యాయం చేశారు. అక్రమ పద్ధతుల ద్వారా రైతులను మోసం చేసి వారి పేరిట చేసుకున్న రిజిస్ట్రేషన్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించినట్లు షాద్ నగర్ ఆర్డిఓ ఎన్ఆర్ సరిత తెలిపారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన కొత్తపల్లి వినోద, కొత్తపల్లి నరసింహారెడ్డిలకు సంబంధించిన భూములు ప్రధానంగా ఏజీపీ డాక్యుమెంట్ పత్రాలు సృష్టించి తద్వారా సెల్ లీడర్ జరగడం ఈ అంశంపై సదరు బాధిత రైతులు మీడియాను ఆశ్రయించడం అదేవిధంగా రెవెన్యూ అధికారులను సంప్రదించడంతో ఇవంతం సంచలనం రేకెత్తించింది.ఈ వ్యవహారంలో కొత్తపల్లి మధుసూదన్ రెడ్డి కొత్తపల్లి సుభాన్ రెడ్డి తదితరులపై కూడా షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయింది. స్థానిక ఏసిపి ఎస్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోని అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం పై స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బాధిత రైతులకు అండగా నిలిచి జిల్లా కలెక్టర్ తదితర రెవెన్యూ అధికారులతో మాట్లాడడం అక్రమాలకు తావు ఇవ్వకూడదన్న అంశంలో బాధితులకు భరోసా ఇవ్వడంతో ప్రభుత్వం స్పందించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అక్రమ రిజిస్ట్రేషన్లు అదేవిధంగా ఏజిపి తదితర అంశాలు రద్దయాయని స్థానిక ఆర్డిఓ ఎన్ఆర్ సరిత పేర్కొన్నారు. ఈ అంశంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. ఈ భూ మాసంలో రియల్టర్ కొత్తపల్లి మధుసూదన్ రెడ్డి, అతని తండ్రి సుభాన్ రెడ్డి, మరో మహిళ నవనీత రెడ్డి, డి.శ్రీకాంత్ రెడ్డి తదితరులపై ఫరూక్ నగర్ తహసిల్దార్ పార్థసారథి ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ కేసు నమోదు చేశారు. ఎసిపి ఎస్ లక్ష్మీనారాయణ సారాద్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.అసలేం జరిగింది..?: చిలకమర్రి గ్రామానికి చెందిన మహిళ రైతు కొత్తపల్లి వినోద భర్త శ్రీనివాస్ రెడ్డి చనిపోగా విరాసత్ ప్రకారం ఆమెకు చిలకమర్రి గ్రామ శివారులో చెల్క భూమి సర్వేనెంబర్ 74/ఆ1/2//1లో ఇరవై ఒకటిన్నర గుంటల భూమి, అదేవిధంగా సర్వే నెంబర్ 68/ఆ/1/2/1 లో 1ఎకరా 32 గుంటలు, 59/ఇ/2/1 లో 15 గుంటలు, ఇలా మొత్తం రెండు ఎకరాల 28.5 గుంటల భూమి కొత్తపల్లి వినోద పేరిట 2022లో విరాసత్ జరిగింది. ఇదే భూమికి సంబంధించి కొత్తపల్లి వినోద మామ అయిన సుభాన్ రెడ్డి, అతని మరో కుమారుడు మధుసూదన్ రెడ్డిలు కలిసి ధరణిలోని లొసుగులను ఆసరాగా చేసుకుని మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మీసేవ సెంటర్ యజమాని, ఆపరేటర్ తో కుమ్మక్కై ఏజిపి డాక్యుమెంట్ ను సృష్టించారు. కొత్తపల్లి వినోద ఫోన్ ద్వారా ఓటిపిని సంపాదించి ఈ అక్రమాలకు పాల్పడ్డ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడంతో చిలకమర్రి గ్రామంలో డిప్యూటీ తహసిల్దార్ ఆనంద్ సింగ్ కు కొత్తపల్లి వినోద కలిసి తన భూమికి సంబంధించిన విషయంలో రైతు భరోసా కోసం వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. అయితే ఈ భూమి ఏజిపి ద్వారా ఇతరులకు వెళ్లిందని చెప్పడంతో ఆమె తనకేమీ తెలియదని చెప్పడంతో ఈ బండారం బయటపడింది. ఆ తర్వాత వినోద రెవెన్యూ సదస్సులు ముగిసిన అనంతరం అధికారిని కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఓటిపి తంగంతో జరిగిన డ్రామా వెలుగు చూసింది. ధరణి లొసుగుతో ఆరితేరిన కొత్తపల్లి సుభాన్ రెడ్డి అతని కుమారుడు కొత్తపల్లి మధుసూదన్ రెడ్డి కలిసి చిలకమర్రి గ్రామానికి చెందిన మరో అమాయక రైతు కొత్తపల్లి నరసింహారెడ్డిని వారి కుట్రలో భాగంగా మరోసారి టార్గెట్ చేశారు. చిలకమర్రి గ్రామానికి చెందిన కొత్తపల్లి నరసింహారెడ్డికి చెందిన సర్వే నెంబర్ 56/ఇ/1, అదేవిధంగా 59/ఆ/అ/2, అలాగే 59 సర్వే నెంబర్లలో గల ఒక ఎకరా 29 గుంటల భూమికి సంబంధించి కొత్తపల్లి మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి నరసింహారెడ్డికి సంబంధించిన మరికొందరిని రంగంలోకి దించి మరో ఏజిపి డ్రామా మొదలుపెట్టారు. మీసేవ సెంటర్ లో మళ్లీ జీపీఏ డాక్యుమెంట్లు సృష్టించారు. అక్కడితో ఆగకుండా సదరు భూమిని దేవి రెడ్డి శ్రీకాంత్ రెడ్డి పేరిట డాక్యుమెంట్ నెంబర్ 508/2025 ప్రకారం సేల్ డీడ్ చేశారు. ఇలా భూములు పట్టదారులకు తెలవకుండానే కొత్తపల్లి సుభాన్ రెడ్డి, కొత్తపల్లి మధుసూదన్ రెడ్డి, నవనీత, మీసేవ సెంటర్ యజమాని, అదేవిధంగా ఆపరేటర్ ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. వెంటనే ఈ విషయం ఫిర్యాదు ద్వారా స్వీకరించిన స్థానిక తహసిల్దార్ పార్థసారథి షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి విధితమే. ఈ మొత్తం ప్రక్రియలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతుంది ఈ నేపథ్యంలోనే అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు కావడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది.