తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి తీర్పు
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష తలా రూ.6 లక్షల జిరిమానా విధిస్తూ ఎర్రచందనం ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పువెల్లడించింది. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ చీఫ్ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను అమలులో భాగంగా టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదై విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలను పగడ్బందీగా నిరూపించి ముద్దాయిలకు శిక్ష పడేలా ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా క్రైమ్ నెంబరు 06-2020లో కరకంబాడి బీటు, తిరుపతి రేంజి పరిధిలో పట్టుబడ్డ ప్రకాశం జిల్లాకు చెందిన చెరబోయిన వెంకటరమణ, పింజరి మహబూబ్ బాషా ఇద్దరు ముద్దాయిలు చేసిన నేరం రుజువయ్యింది. దీంతో తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహ మూర్తి ఒకొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాల మేరకు వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ముద్దాయిలకు శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని టాస్క్ ఫోర్సు ఉన్నతాధికారులు అభినందించారు. శేషాచలం రిజర్వు ఫారెస్టులో అత్యంత విలువైన సహజ సంపద ఎర్ర చందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేసే నేరస్తులకు ఈ తీర్పు ఒక హెచ్చరికగా పని చేస్తుందని టాస్క్ ఫోర్సు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష…ఒకొక్కరికి రూ. 6లక్షల జరిమానా
Related Posts
భక్తుల రద్దీకి తగిన వసతులతో పవిత్రత ఉట్టిపడేలా పెంచలకోన బ్రహ్మోత్సవాలు: నెల్లూరు ఆర్డీవో నాగ సంతోషిణి అనూష
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నెల్లూరు జిల్లా రాపూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 8 నుంచి 14 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిణి అనూష అన్నారు.. పెంచలకోన దేవస్థానం ఈవో పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై పెంచలకోన క్షేత్రంలోని కమ్మ కళ్యాణ మండపంలో మంగళవారం వివిధ…
Read moreఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ టాపర్ వైష్ణోదేవి
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ లో టాపర్ కొత్తనూరు వైష్ణోదేవి నిలిచారు. ప్రముఖ సినీ, సీరియల్ నటుడు శ్రీహరి- లలితభవాని దంపతుల కుమార్తె అయిన వైష్ణోదేవి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు హైదరాబాద్ లోని ఏ.ఎస్.రావు నగర్ భాష్యం స్కూల్ చదివింది. 10వ తరగతిలో 9.5 జిపిఏ మార్కులు సాధించారు. హైదరాబాద్ మణి కొండ శ్రీ చైతన్య విద్యా సంస్థ బ్రాంచ్ లో ఇంటర్మీడియట్…
Read more