ప్రభాతదర్శిని (ప్రత్యేక- ప్రతినిధి): నాయుడుపేట మండలం పుదురు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించి తమ హవాను చాటుకున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్లో 99 శాతం, జూనియర్ ఇంటర్మీడియట్ లో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ గ్రూపులో ఎన్ శృతి 440 మార్కులు, బైపీసీలో పి నేహాలత 417 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో బి నందిని 934 మార్కులు, బైపిసి లో షకీలా 963 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్, బైపీసీలో 11మంది 900 మార్కులు పైన, ఎంపీసీలో ఒకరు 900 మార్కులుపైన సాధించారు. అలాగే జూనియర్ ఇంటర్లో ఎంపీసీలో తొమ్మిది మంది, బైపీసీలో ఐదు మంది 400 మార్కులు పైన సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె.రౌతు రమోల విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకుల కృషి ఫలితమే ఇంటర్మీడియట్ ఫలితాలని ఆమె తెలిపారు.
ఇంటర్ లో పుదూరు గురుకులం విద్యార్థుల హవా
Related Posts
విశ్వసనీయతకే మరో మారు పట్టం…వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఓడూరు గిరిధర్ రెడ్డి
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఓడూరు గిరిధర్ రెడ్డి రెండోసారి ఎంపికయ్యారు. జగన్మోహన్ రెడ్డి కి విశ్వసనీయుడుగా పార్టీ ఆవిర్భావం మునుపునుండే అనుబంధం ఉన్న కారణంగా గిరిధర్ రెడ్డికి ఈ పదవి దక్కింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి తో ఓడూరు గిరిధర్ రెడ్డి కి ఉన్న అనుబంధం వీడదీయరానిదని చెప్పవచ్చు. 2004 సంవత్సరం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ స్టేట్…
Read moreతాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతరను పండుగ వాతావరణంలో నిర్వహిద్దాం: జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
ప్రభాతదర్శిని (తిరుపతి-ప్రతినిధి): మే 6వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు జరిగే శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను పండుగ వాతావరణం నిర్వహిద్దామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు పిలుపు నిచ్చారు. సోమవారం సాయంత్రo స్థానిక కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన జాతర నిర్వహణ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని…
Read more