ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): అగ్ని ప్రమాదానికి గురైన నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్ ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు.. దుకాణదారుల బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. నేనున్నానంటూ వ్యాపారస్తులకు మంత్రి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు మార్కెట్లో అగ్నిప్రమాద విషయం తెలియగానే అందరిని అప్రమత్తం చేశానని తెలిపారు. వ్యాపారులకు అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పానని… ప్రమాదానికి గురైన షాపులను ఆయన పరిశీలించినట్లు చెప్పారు.. వచ్చే సోమవారంలోపు రెన్యువేషన్ పనులను పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశాలు జారీ చేశారు.. బాధితులకు చెప్పిన విధంగా నష్టపరిహారం త్వరలోనే అందజేస్తామని మంత్రి తెలిపారు. 2014లో సంతపేట మార్కెట్ ను అభివృద్ధికి శ్రీకారం చుట్టామని అయితే 90 శాతం పనులు కూడా పూర్తి చేసామని చెప్పారు.. గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ప్రారంభించలేదని మండిపడ్డారు.. మార్కెట్ వ్యాపారస్తులందరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, రాష్ట్ర వేర్ హోసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పిటిసి విజేతారెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు, నగర మహిళా అధ్యక్షులు కపిర రేవతి, కార్పొరేటర్లు ,డివిజన్ ప్రెసిడెంట్లు ,టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
