ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులుగా కట్టా భవాని శంకర్ రెడ్డిని వైసిపి అధిష్టానం నియమించింది. విజయ డైరీ డైరెక్టర్ గా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం సూళ్లూరుపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయనను నియోజకవర్గ వైసిపి రైతు విభాగం అధ్యక్షులుగా నియమించింది. నియోజకవర్గ వైసిపి రైతు విభాగం అధ్యక్షులుగా నియమితులైన కట్టా భవాని శంకర్ రెడ్డి కి పలువురు వైసిపి నాయకులు అభినందనలు తెలియజేశారు.తనపై నమ్మకంతో అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని కట్టా భవాని శంకర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులుగా తనను నియమించిన పార్టీ అధిష్టానానికి,నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు కట్టా భవాని శంకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులుగా పాలేటి నాగార్జున : సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులుగా పాలేటి నాగార్జున ను వైసిపి అధిష్టానం నియమించింది. నాయుడుపేట మున్సిపల్ కౌన్సిలర్ గా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం సూళ్లూరుపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయనను నియోజకవర్గ వైసిపి యువజన విభాగం అధ్యక్షులుగా నియమించింది. నియోజకవర్గ వైసిపి యువజన విభాగం అధ్యక్షులుగా నియమితులైన పాలేటి నాగార్జున కు పలువురు వైసిపి నాయకులు అభినందనలు తెలియజేశారు.తనపై నమ్మకంతో అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని పాలేటి నాగార్జున తెలిపారు. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులుగా తనను నియమించిన పార్టీ అధిష్టానానికి,నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు పాలేటి నాగార్జున కృతజ్ఞతలు తెలియజేశారు.