ప్రభాత దర్శిని (ఒంగోలు-ప్రతినిధి):టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు నియోజకవర్గ శాసన సభ్యులు దామచర్ల జనార్ధన్ రావు శుక్రవారం ఉదయం నుండి పలు కార్యక్రమాలలో పాల్గొన్న బిజీ బిజీగా నాయకులతో కలిసి కార్యక్రమాలలో పాల్గొన్నారు ఒకవైపు ప్రారంభోత్సవాలు, మరో వైపు ఆదరింపులు అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా ఒంగోలు నగరంలోని 30వ డివిజన్ నందు 32 లక్షలతో నిర్మించిన ఆరామక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగినది. ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి జనార్ధన్ రావు మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒంగోలు నగరంలోని హోటల్ వై ప్యాలెస్ నందు పావులూరి మనోజ్ కుమార్ కుమార్తె ఓణిల వేడుకల్లో పాల్గొన్నడం జరిగినది.ఒంగోలు నగరంలోని పెర్నమిట్ట నందు ఇటీవల మరణించిన ఈదర మహేశ్వరావు కుటుంబ సభ్యులను పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగినది. ఈ సందర్భంగా జనార్ధన్ రావు మహేశ్వర రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఒంగోలు నగరం లోని ముక్తి నూతలపాడు గ్రామం నందు ఇటీవల మరణించిన హెడ్ కానిస్టేబుల్ కోమిటినేని విజయ్ కుటుంబ సభ్యులును పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగినది. ఒంగోలు నగరంలోని కొప్పోలు నందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన చిన్నారుల కుటుంబ సభ్యులును పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగినది. ఈ సంఘటన తనను కలిచి వేసిందని జనార్ధన్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఆయన మొక్కలను నాటారు. ఆయా గ్రామాల్లోని ప్రజలతో మమేకమై ముచ్చటించారు. “నేనున్నాను “అనే మనో ధైర్యాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలతో కలిగించారు. ఈ కార్యక్రమంలో.ఎమ్మెల్యే జనార్ధన్ రావు వెంట పలువురు స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.