ప్రభాతదర్శిని,( నెల్లూరు-జిల్లా ప్రతినిధి): గత వైసిపి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వలన ఆర్టీసీని అప్పులు ఊబిలోకి నెట్టింది అని ఆర్టిసి జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన పాలనంత తూతూ మంత్రంగా సాగించాడని, అప్పట్లో అభివృద్ధి జరిగింది అంటే కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలు మాత్రమే ప్రజలకు అందాయని అన్నారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి శుక్రవారం నెల్లూరులో డి.ఆర్ ఉత్తమ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరి మాట వినకుండా ఆర్టీసీని ఏ విధమైన అభివృద్ధి పరచకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించకుండా నియంతృత్వ పాలన కొనసాగించిన గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం బస్సులు కూడా వెళ్లలేని దయనీయమైన స్థితికి రోడ్లను తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. తాను ఆర్టీసీ చైర్మన్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు.ఈ నేపథ్యంలో ఆర్టీసీ అభివృద్ధికి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద నుండి నెల్లూరు జిల్లాలోని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ లతో… ఎమ్మెల్యేలతో కలసి అభివృద్ధిపరిచేందుకు తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.రిటైర్డ్ ఉద్యోగుల అవస్థలు వర్ణనా తీతం అన్నారు. అన్ని శాఖలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు లాగానే ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ ఏ సమయానికి వారికి రావలసిన ప్రాఫిట్స్ పెన్షన్ సమయానికి రాక సంవత్సరాలపాటు కార్యాలయాల చుట్టూ తిరగటం జరుగుతుందన్నారు. ఇక ముందు అలా లేకుండా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని తెలిపారు. ఇప్పటికిప్పుడే అన్ని చేసేస్తానని నేను చెప్పలేనని అన్నారు. క్రమేణ ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించి ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను కల్పించే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి. నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్. జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ ఓబీసీ మోర్చా రాష్ట్రా నాయకులు , ముక్కు రాధాకృష్ణ గౌడ్, గిరి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.