ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): విదేశీ వర్సిటీల తరహాలోనే విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు ఇచ్చేందుకు దేశంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు అనుమతిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చీఫ్ తెలిపారు. ఈ విషయంపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. 2024-25 అకడమిక్ ఇయర్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రెండు అడ్మిషన్ సైకిల్స్ ఉంటాయని అన్నారు. జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరి మధ్య దేశంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్లు జరుగుతాయని చెప్పారు. “భారతీయ విశ్వవిద్యాలయాలు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు ఇస్తే బోర్డు ఫలితాల ప్రకటనలో జాప్యం, ఆరోగ్య సమస్యలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల జులై-ఆగస్టు సెషన్ లో యూనివర్సిటీల్లో అడ్మిషన్లు కోల్పోయిన చాలా మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్లు పెట్టడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం. ఎందుకంటే జూన్- ఆగస్టు సెషన్లో యూనివర్సిటీ లేదా ఉన్నత విద్యాసంస్థలో విద్యార్థులు చేరకపోయినా వారు మరుసటి ఏడాది వరకు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ద్వైవార్షిక అడ్మిషన్ల వల్ల కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను ఏడాదికి రెండుసార్లు చేస్తాయి. దీంతో గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.” అని యూజీసీ చీఫ్ తెలిపారు.’ఇప్పటికే విదేశీ యూనివర్సిటీలు ఫాలో అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ద్వైవార్షిక అడ్మిషన్ విధానాన్ని అనుసరిస్తున్నాయని యూజీసీ చీఫ్ తెలిపారు. భారతీయ ఉన్నత విద్యాసంస్థలు కూడా ఇలాంటి అవకాశం కల్పిస్తే ప్రపంచ విద్యా ప్రమాణాలకు పాటిస్తున్నట్లు అవుతుందని పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థలు ద్వైవార్షిక అడ్మిషన్లు అందించడం తప్పనిసరి కాదు. అవసరమైన మౌలిక సదుపాయాలు, టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్న ఉన్నత విద్యాసంస్థలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచాలని వారికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ అవకాశం ఇచ్చింది. ద్వివార్షిక అడ్మిషన్లు ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకులు, ల్యాబ్స్, తరగతి గదుల వంటి వాటిని సమకూర్చు కోవడానికి వీలు కల్పిస్తాయి.
విదేశీ వర్సిటీల తరహాలో విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు
Related Posts
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూత
ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ ప్రతినిధి): మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహా…
Read more“మానవత”చే భూరి విరాళం – ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం
శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్…
Read more