దళారులకు చెక్ పెడతాం: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ప్రభాతదర్శిని,
(శ్రీకాళహస్తి-ప్రతినిధి):ప్రముఖ రాహు – కేతు నివారణ క్షేత్రం, విశిష్ట శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దళారీ బెడద నుండి భక్తులను కాపాడేందుకు వీలుగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో త్వరలో నగదు రహిత పూజాలను, నిత్య పూజలు, ఆర్జిత సేవలను, అతిథి గృహాలను భక్తులకు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు.ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో ఉన్న రాహు- కేతు పూజలు, రుద్రాభిషేక సేవలు, స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన టికెట్లు కొనుగోలు వంటివి ఇకపై భక్తులు ఆన్లైన్ లో , ఫోన్ పే, గూగుల్ పే రూపంలో చెల్లించే విధంగా ఈ- సేవలను అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. దీంతో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా పూజా టిక్కెట్లు కొనుగోలు చేసేఅవకాశం ఉంటుందని చెప్పారు. దీంతో దళారీల బెడద నుండి భక్తులను కాపాడుతామని తెలిపారు. ఇప్పటికే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారని, త్వరలోనే ఈ విధానం కార్యరూపం దాలుస్తుందని చెప్పారు తెలిపారు.అలాగే ప్రసాదాల కొనుగోలు కూడా ఈ విధానం అమలు చేస్తామని, దాతల విరాళాలు కూడా ఈ విధానం ద్వారా సేకరిస్తామన్నారు. దీంతో ఆలయంలో జవాబుదారి విధానం అమలు చేస్తామన్నారు.ఈ సమావేశంలో ఆలయ ఇంచార్జి ఈ ఓ చంద్రశేఖర్ ఆజాద్ కూడా పాల్గొన్నారు.