శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం
ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంకు మానవతా సంస్థ ప్రతినిధులు రాళ్లపల్లి మాధవ నాయుడు, సుకుమార్ రాజు, భార్గవ, ఎంవి రమణ, సుధాకర్ బాబులు వెళ్లి పది బస్తాల బియ్యం,ఇతర ఆహారపు వస్తువులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా మానవతా ప్రతినిధులు మాట్లాడుతూ వికలాంగురాలైన శైలజ చేస్తున్న సేవలను అభినందించారు. శైలజ మాట్లాడుతూ తమ సంస్థలను ప్రత్యేక ప్రతిభావంతులకు ఆధార సౌకర్యం కల్పించాలని కోరారు. ఈనెల 29న తిరుపతి యూత్ హాస్టల్ లో జరిగే వార్షికోత్సవ కార్యక్రమానికి మానవతా సభ్యులు హాజరు కావాలని కోరారు. తమకు సాయం అందించిన మానవతా తిరుపతి శాఖకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.