ప్రభాతదర్శిని (చిత్తూరు-ప్రతినిధి): చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం నుండి బైకులో మదనపల్లికి నాటు సారా తెస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మదనపల్లె ఎక్సైజ్ సిఐ భీమ్ లింగ తెలిపారు. సీఐ కథనం… పుంగనూరు మండలం, సుగాలి మిట్ట సమీపంలోని నల్లగుట్ట తండా కు చెందిన రమేష్ నాయక్(30) తన స్కూటీలో 40 లీటర్ల నాటు సారా, అదే ఊరికి చెందిన అతని స్నేహితుడు మరో బైక్ లో 40 లీటర్ల నాటు సారా తీసుకుని మదనపల్లికి ఒకరి వెనకాల ఒకరు వస్తూ ఉన్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు. వెంటనే తనతో పాటు ఎస్ఐ లు డార్కస్, జబీ ఉల్లా సిబ్బంది వెళ్లి చండ్రమాకులపల్లి క్రాస్ లోని 150మైళ్ల వద్ద వాహణాల తనిఖీలలో రమేష్ నాయక్ పట్టు బడగా, మరొకరు పరారయ్యారని సీఐ తెలిపారు. పట్టుబడ్డ నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నాటుసారా, బైకును సీజ్ చేసామన్నారు అలాగే నిందితుడు వదిలేసి వెళ్లిన బైక్ నాట్సారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు అనంతరం అరెస్టు చేశామని తెలిపారు.