ప్రస్తుతం రౌడీషీట్ కు చట్ట బద్దత లేదంటున్న న్యాయ స్థానాలు… ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ-ప్రతినిధి): సమాజంలో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో, కోర్టుల్లో, పలు కేసుల్లో, రాజకీయంగా రౌడీషీట్ అనే పదం వింటూనే ఉంటాం. రౌడీషీట్ అనగానే చాలా మందికి సాధారణ ప్రజలకి ఒకరకమైన భయం, అభద్రత భావం. రౌడీ షీటర్ అనీ ఒక వ్యక్తికి ముద్రపడగానే కొంత వరకు సమాజం ఆ వ్యక్తీ పట్ల చిన్నా కూడా చూపు చూపిస్తుంది. కొందరు సాధారణ పౌర జీవనం నుండి గతీ తప్పిన యువకులు చెడు వ్యసనాలకు పాల్పడి నేరాలు చేసి కేసులు నమోదు కావటం వలన పలు పోలీస్ స్టేషన్ లలో రౌడీలు గా నమోదు అవుతున్నారు. కొందరు సినీమాలూ , సీరియళ్లు , సాంఘిక , కుటుంబ నేపథ్యం లో రౌడీ లుగా నమోదు అయితే మరీ కొందరు స్థానిక పరిస్థితుల ఆధారంగా రాజకీయ క్రీడలో కక్ష్య పూరితంగా రౌడీలుగా బలవంతంగా నమోదు అవుతున్నారు . నేటి కాలంలో అయితే రాజకీయనాయకులే కొందరు పోలీస్ అధికారుల సహాయంతో కక్ష్య పూరితంగా రౌడీ షీటర్ లను ఉత్పత్తి చేస్తున్నారు ముద్రవేస్తున్నారు. స్థానికంగా ఎదుటి వ్యక్తి అంటే గిట్టనివారు ఇతర ప్రత్యర్థుల మీదా పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేయించి ఎదుటి వ్యక్తికి వినాశనాన్ని కోరుకుంటున్నారు. ఇది ఒక రకమైన విద్వేషంగా. చెప్పవచ్చు. ఒక వ్యక్తి పదే పదే అలవాటుగా నేరాలకు పాల్పడితే అతని పై పోలీసులు రౌడీషీట్ నూ నమోదు చేయటాన్ని రౌడీషీట్ అంటారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అభ్యర్థన మేరకు సిపి, ఎసిపి, డిఎస్పీ, లాంటి ఉన్నాత పోలీసు అధికారులు రెండూ, లేదా మూడు కంటే ఎక్కువ కేసులూ నమోదు కాబడిన వ్యక్తుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నచిన్న నేరాలకు కాకుండా పబ్లిక్ ఆర్డర్ కూ భంగం కలిగిన సందర్భాల్లో జడ్జీ అనుమతితో ఓపెన్ చేయాలీ అది కూడా హిస్టరీ షీట్ మాత్రమే రౌడీషీట్ ఎంత మాత్రం కాదు.తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 2500 పైగా రౌడిషీట్స్ ఓపెన్ చేశారని గణాంకాలు చెప్తున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పిఎస్ఓ లు పోలీస్ పరిపాలన మార్గదర్శకాలు తెలంగాణలో కూడా దత్తతకు తీసుకున్నాము. వాటి ఆధారంగానే రౌడీషీట్ లు నమోదు చేస్తున్నారు. రౌడిషీట్లు ముఖ్యంగా భూ మాఫియా చేసే వారిపై, సెటిల్మెంట్ లు చేసేవారిపై, హత్య కేసులు ఉన్నవారిపై, ఇవ్ టీజర్స్ పై, దోపిడీలు చేసే వారిపై రౌడిషీట్లు నమోదు చేస్తున్నారు పోలీస్ లు. భూ సమస్యలు ఉన్నవారి పై, చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారి పై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని పోలీస్ స్థానిక రాజకీయాలకు తలోగ్గి సామాన్యుల మీద రౌడి షీట్లు నమోదు చేసిన సంఘటనలు కోకొల్లలు. ఇంటి పక్కవాల్లతో విభేదాలు, ద్వేషం, అసూయ, రాజకీయ కక్ష్యలు లాంటి కారణాల చేత కూడా రౌడి షీట్లు నమోదు చేస్తున్నారు పోలీస్ అధికారుల రాజకీయ జోక్యం తోనే రౌడి షీట్లు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రౌడిషీట్ కు ఎఫ్ఐఆర్ ఉండదు, కేసు ఉండదు.మీపై పోలీస్ స్టేషనులో పలు కేసులూ నమోదు అయినప్పటికీ మీ పై చట్టము ప్రకారం రౌడీషీట్ ఓపెన్ చేయటం కానీ, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ జస్టిస్ ఇవీఎస్ సోమయాజులు సంచలనమైన తీర్పు నూ వెలువరించారు ఆ తీర్పు ప్రకారం మీ వ్యక్తిగత వివరాలను,చిరునామా లను పలు పోలీస్ స్టేషన్లో ప్రదర్శించటం చెయ్యరాదు. అలాగే మీ తలపై ముసుగు వేసి , లేదా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టీ మీరూ రౌడీ లు అనీ చెప్పటానికి కూడా వీలు లేదునీ మీ ఫొటోస్, వేలి ముద్రలు కూడా తీసుకోవ టానికి పోలీస్ లకు లేదని, మీ వ్యక్తిగత గోప్యతా హక్కులను బంగపరచటానికి పోలీస్ లకు అధికారం లేదు అని ఏపీ హై కోర్ట్ స్పష్టం చేసింది. సుప్రీం కోర్ట్ కే ఎస్ పుట్టు స్వామి కేసులో ఇచ్చిన తీర్పును ఉల్లంఘించరాదని పేర్కొంది. కాబట్టి మిమ్మలని రౌడీ లు అనీ చెప్పటానికి పోలీసులకు ఎంత మాత్రం అధికారం లేదు.మీ పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తే పోలీస్ ల పై క్రిమినల్ అండ్ సివిల్ కేసులు వేయొచ్చు. పోలీస్ లు చట్టబద్దత లేని రౌడీ షీట్ మీ పై ఓపెన్ చేస్తే సదర్ పోలీస్ అధికారి పై మీరూ క్రిమినల్ కేసులు మరియూ సివిల్ కేసులు పరువు నష్టం దావా కేసులు వేయొచ్చు. అలాగే కోర్టు దిక్కరణ కేసులు కూడా నమోదు చెయ్యొచ్చు. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు కె యస్ పుట్టు స్వామీ కేసు లో , ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ ఈవీఎస్ సోమ యాజులు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అంశాలను బేస్ చేసుకోవచ్చు. స్వయంగా హైకోర్ట్ రౌడీ షీట్ ఓపెన్ చేస్తే కోర్ట్ దిక్కరణ కేసులు నమోదు చేయాలని పేర్కొనటం గమనార్హం.చాలా మంది రౌడీ షీట్ నమోదు అయిన వ్యక్తులూ, సామాన్యులు రౌడీ ఓపెన్ కాగానే ఇక వారి జీవితం ముగిసిందని జీవితం ప్రమాదంలో పడింది అనీ ఆత్మ నున్యత భావంలో వెళ్తున్నారు. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో చాలా మందికి తెలియదు. ఒక రౌడీ షీట్ క్లోజ్ చేయాలంటే ఒకటీ పోలీస్ అధికారులు చేస్తారు రెండోది కోర్టు చేస్తుంది. పోలీస్ అధికారుల దృష్టిలో సదర్ రౌడీ షీట్ నమోదు కాబడిన వ్యక్టి ప్రవర్తనలో మార్పు వచ్చిందని భావించి అతనీ పై ఎలాంటి క్రిమినల్ కేసులో లేకుంటే జిల్లా స్థాయి పోలీస్ ఉన్నత అధికారి ఎస్.ఎచ్.ఓ సూచన మేరకు తొలగించవచ్చు కానీ ఎలాంటి కేసులు లేకున్నా , కేసులు కోర్టులలో కొట్టుడు పోయిన రౌడీ షీట్ నూ పోలీస్ లు కొనసాగిస్తున్నారు. రెండోది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హై కోర్టులో మీ పై నమోదు అయిన రౌడీ షీట్ ను సవాల్ చేస్తూ వాజ్యం వేయొచ్చు. రౌడీ షీట్లకు చట్ట బద్దత లేదు కాబట్టి కచ్చితంగా కొట్టివేయబడుతుంది.
జస్టిస్ ఇ.వీ.ఎస్ సోమ యాజులు ఇచ్చిన తీర్పులో ముఖ్యమైన అంశాలను ఒకసారి తప్పకుండా పరిశీలిద్దాం.: పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ కేవలం పరిపాలన మార్గదర్శకాలు మాత్రమే అనీ స్పష్టం చేసింది.రౌడీ షీట్ నమోదు,కొనసాగింపు తరుచ ఠానాల్లోకి పిలవటం, వేలి ముద్రల, ఫోటోల సేకరణ, ప్రదర్శన, వ్యక్తుల గోప్యతా హక్కులను ఉల్లంగించ డమేనని స్పష్టం చేసింది. పోలీస్ మార్గ దర్శకాల ఆధారంగా రౌడీ షీట్ నమోదు చేస్తే కోర్ట్ దిక్కరన కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది. చట్టం అనుమతి లేకుండ రౌడీ షీట్ నమోదు కొనసాగింపు,వ్యక్తిగత సమాచారం సేకరించవద్దని పోలీస్ లకు తేల్చి చెప్పింది. పోలీస్ మార్గదర్శకాల పేరు చెప్పి నిందితుల, అనుమానితుల ఇండ్లకు రాత్రిళ్ళు వెళ్ళ వద్దని చెప్పింది. వారాంతపు సెలవుల్లో నిందితుల,అనుమానితులను పోలీస్ స్టేషన్లకు పిలువ వద్దని, ఠానాల్లో వారిని వేచి ఉండేలా చెయ్యొద్దని పేర్కొంది.స్టేషన్ దాటి వెళ్ళాలంటే అనుమతి తీసుకోవాలనే షరతులు పెట్టొద్దని పోలీస్ లకు స్పష్టం చేసింది.సుప్రీం కోర్ట్, హై కోర్ట్ గతంలో ఇచ్చిన తీర్పులను ఉల్లంఘిస్తూ రౌడీ షీట్ లు నమోదు చేస్తున్నారని పేర్కొంది. తగిన కారణాలు, విశ్వసనీయ సమాచారం లేకుండా లేకుండ చాలా మంది పై రౌడీషీటర్ లుగా ముద్రా వేస్తున్నారని అంది.1960 లో ఎపి.పి. ఎస్.వో ప్రవేశ పెట్టినపుడు అవీ మార్గదర్శకాలేనని ఆ జి.ఓ లనే స్పష్టంగా పేర్కొన్నారు అనీ తెలిపింది. ఏపీ.పి.ఎస్. ఓ కు చట్ట బద్దత లెని ఏపీ.పి.ఎస్.ఓ ఆధారంగా రౌడీ షీట్ నమోదు, నిఘా పెట్టడం, ఫొటోల ప్రదర్శన చేయటం కే.ఎస్ పుట్టు స్వామీ కేసులో సుప్రీం కోర్టులో ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమే అని తెలుస్తోంది.
పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు….సుప్రీంకోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు…
Related Posts
స్థానిక సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ కు తెలియజేయండి…నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక సమస్యలను కమాండ్ కంట్రోల్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కి ఫోన్ ద్వారా తెలియజేస్తే తక్షణమే స్పందించి ఫిర్యాదును పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ సూర్యతేజ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ సూర్యతేజ…
Read moreరుషికొండ ప్యాలెస్ నిర్వాక భావదారిద్ర్యం:చంద్రబాబు పొగిడారని వైసీపీ ప్రచారం
ప్రభాతదర్శిని, (విశాఖ-ప్రతినిధి):వెనకటికి ఒకడు తప్పు చేశానని ఆయన చెప్పుతో కొట్టాడు కానీ ఆ చెప్పు బంగారంతో చేసిందని చెప్పుకుని సంతోషపడ్డాడట… ఇప్పుడు వైసీపీ పరిస్థితి అంతే ఉంది. చంద్రబాబు విశాఖ రుషికొండ ప్యాలెస్ విషయంలో జగన్ రెడ్డి నిర్వాకాన్ని బయటపెడితే… చంద్రబాబు పొగిడారని ప్రచారం చేసేసుకుంటున్నారు. ఈ దొంగలకు ఇంత ఇన్నోవేషన్ ఎక్కడి నుంచి వస్తుందో అని చంద్రబాబు ఆశ్చర్యపోయారు. దొంగలన్న సంగతి మర్చిపోయి ఇదిగో ఇన్నోవేషన్ అని..…
Read more