కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
మండల మీట్ కు గైర్హాజరైన వైద్యులపై ఎమ్మెల్యే ఆగ్రహం
బుచ్చి మండల మీట్లో సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసిన కాంట్రాక్టర్లపై కేసులు పెట్టాలని కోవూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నిధులను స్వాహా చేసి పనులు చేయని కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని కోరారు. గత ప్రభుత్వం హయాంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండానే బిల్లులు డ్రా చేసుకున్న కాంట్రాక్టర్లను గుర్తించి కేసులు పెట్టి స్వాహా చేసిన ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేయాలని ఆమె హోసింగ్ అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా జరిగిన సమీక్షలలో అధికారులకు పలు సూచనలు సలహాలు అందచేశారు. బిజెపి ఎంపిటిసి వినయ్ నారాయణ లేవనెత్తిన ప్రశ్నల పై స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి 24 గంటలు సేవలు అందివ్వాల్సిన బుచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రాత్రులు డాక్టర్లు అందుబాటులో ఉండని విషయంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య అధికారులకు సూచించారు. గ్రామీణ రోడ్ల పై మలుపులు వుండే చోట రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా బాధ్యతాయుతంగా విధి నిర్వహణ చేయాలని అధికారులను కోరారు.అలాగే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని ప్రశాంతి రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వ్యవసాయ సమీక్షపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పందిస్తూ ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులను కోరారు. రానున్న ఉగాది సందర్భంగా మండలాల వారీగా ఉత్తమ రైతులు, పాడి రైతులను, విద్యాభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యాయులను, శుభ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక పురస్కారాలు ప్రత్యేక పురస్కారాలు అందచేస్తామన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ పై వరి విత్తనాలను అందచేశారు. పాడి పంటలతో రైతులు సుభిక్షంగా వుండాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలుగా ఎన్నికైన ప్రశాంత్ రెడ్డిని అధికారులు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.ఈ సమావేశంలో ఎంపిపి మన్నేపల్లి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన మండల సర్వ సభ్య సమావేశంలో ఎంపిడిఓ శ్రీహరి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, జెడ్పిటిసి శ్రీదీపలతో పాటు మండల పరిధిలోని ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్నారు.