వింజమూరు బడికి పోదాం రా..ర్యాలీలో ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పనికెందుకు తొందరా బడికి పోదాం ముందరా.. ర్యాలీలో ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు. డిప్యూటీ డీఈవో పి రఘురామయ్య ఎంఈఓ ఎం మధుసూదన్ రెడ్డి హెచ్ఎం లు సిహెచ్ మాల కొండయ్య డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మరియు జడ్పీ బాలబాలికల ఉన్నత పాఠశాల విద్యార్థుల చేత నిర్వహించిన ర్యాలీ స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుండి బంగ్లా సెంటర్, పంచాయతీ బస్టాండ్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొని మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనికి ఎందుకు తొందరా.. బడికి పోదాం ముందరా అంటూ సందేశం ఇచ్చారు. ప్రతి తల్లి తండ్రి వారి బిడ్డలని బడికి పంపించాలని తెలిపారు. నేటి బాలబాలికలు చదువుతూ ఎదగాలన్నారు. అదేవిధంగా విద్యాశాఖ డిపార్ట్మెంట్ కు అనుసంధానంగా ఉన్న మిగతా డిపార్ట్మెంట్లు వారు కూడా పిల్లలను బడికి చేర్పించే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తితే మా దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి చిన్నారి బడిలో ఉండాలన్నారు. విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. చదువును ప్రోత్సహిస్తూ విద్యార్థుల ఖర్చుల నిమిత్తం తల్లికి వందనం ద్వారా ప్రతి బిడ్డకు ఏడాదికి 15 వేల రూపాయలు అందజేస్తారని తెలిపారు. పేదరిక నిర్మూలనకు చదివే సరైన మార్గమని తెలిపారు. నేటి యువతరానికి ముందుచూపు మంత్రి నారా లోకేష్ అని అన్నారు. ముందు చూపుతో అనేక కార్యక్రమాల కు రూపకల్పన చేస్తున్న నారా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేశారు. జులై ఒకటవ తేదీన పింఛన్ దారులకు గత మూడు నెలల బకాయిలతో కలిపి 7000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు 4400 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లావ్యాప్తంగా 319961 మంది లబ్ధిదారులకు రు 218.87 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. సచివాలయం సిబ్బంది ద్వారా ఒకటో తేదీ ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందజేయడం జరుగుతుందన్నారు. వింజమూరు మండలంలో 5670 మందికి 3కోట్ల 84 లక్షల 20వేల 500రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గుండె మడగలలో జరుగు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. కనుక ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డలను బడికి పంపించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గొంగటి రఘునాథరెడ్డి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ గూడా నరసారెడ్డి కోడూరు నాగిరెడ్డి పాములపాటి మాలాద్రి మంచాల శ్రీనివాసులు వనిపెంట సుబ్బారెడ్డి చల్లా శ్రీనివాస్ యాదవ్ చల్లా మాల్యాద్రి యాదవ్ కొండపల్లి వెంకటేశ్వర్లు పల్లా మధు జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ బిజెపి మండల అధ్యక్షులు డేగ మధు యాదవ్ పిడి ప్రభాకర్ రెడ్డి పి ఈ టి వెలుగోటి కృష్ణ సిడిపిఓ పద్మజా కుమారి ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు.