ప్రభాతదర్శిని (తిరుపతి- జిల్లాప్రతినిధి):: ఈనెల 14 నుండి 20 వరకు జిల్లాలో పండుగ వాతావరణంలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ చాంబర్ నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా డ్వామా పి డి, డిపిఓ, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఎంపీడీ ఓలు, పంచాయతీ సెక్రటరీలు, ఏపీఓలు,పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఇంజనీరింగ్ అధికారుల తో జిల్లాలో ఈ నెల 14 నుండి 20 తేది వరకు నిర్వహించే పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు నిర్వహణపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 14 నుండి 20 వరకు జిల్లాలో గ్రామ స్థాయిలో నిర్వహించే పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలు సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకొని జిల్లా లో విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతి పంచాయతీ పరిధిలో ఈ సంవత్సరములో చేసే అభివృద్ధి పనులకు సంబంధించి ఆ గ్రామం లో బోర్డు ఏర్పాటు చేయాలని సంబందించిన అధికారులను ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా,పంచాయతీ రాజ్ శాఖల ద్వారా గ్రామస్థాయిలో వందకు వంద శాతం పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పంచాయతి సెక్రటరీలు ఉపాధి హామీ పథకం ద్వారా చేప్పట్టే పనులను పూర్తిచేయాలని, పంచాయతీ సెక్రటరీలు రెండు రోజులు ముందుగానే గ్రామ స్థాయిలో నిర్వహించే పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల నిర్వహణకు సంబంధించి టామ్ టామ్ వేయించాలన్నారు. భూమి పూజ చేసే వాటికి సంబంధించి పంచాయతీల్లో ప్రచారం చేయాలని, పంచాయతీ పరిధిలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు, భూ పూజ వంటి కార్యక్రమాల పూర్తి వివరాలను ప్రజా ప్రతినిధులకు ముందుగానే తెలియజేయాలని పంచాయతీ సెక్రెటరీలకు సూచించారు.పంచాయతీరాజ్, నీటి సరఫరా శాఖల ద్వారా పంచాయతీ పఫదిలో మంజూరు చేసిన పనులను గ్రామ గ్రౌండింగ్ కు సంబంధించి పంచాయతి సెక్రటరీలు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పంచాయతీ పరిధిలో ఎక్కడెక్కడ ఏఏ పనులు చేసే వాటికి సంబంధించి ఎప్పుడు పూర్తి చేస్తారన్న పూర్తి వివరాలను గ్రామ సభలో ప్రజలకు తెలియజేసే విధంగా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ గ్రామాలలో సిసి రోడ్లు,శ్మశాన వాటికల గుర్తించిన వాటికి జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.జిల్లా కలెక్టరేట్ నుండి జూమ్ కాన్ఫరెన్స్ లో డ్వామా పిడి శ్రీనివాస్ ప్రసాద్,జిల్లా పంచాయతీ అధికారిణి సుశీల దేవి, మండల స్థాయి లో యం పి డి ఓ లు, పంచాయతీ సెక్రటరీ లు,ఏ పి ఓ లు,పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఈ ఈ లు,డి ఈలు,ఏ ఈలు తదితరులు పాల్గొన్నారు.