నావిగేషన్ అభివృద్ధి పరచే దేశాల సరసన భారత్
ప్రభాతదర్శిని, (సూళ్లూరుపేట-ప్రతినిధి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 100వ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు కౌంట్ డౌన్ మొదలయ్యింది. బుధవారం ఉదయం 6:23 నిమిషాలకు 100వ ప్రయోగం శ్రీహరికోట లోని రెండవ రాకెట్ ప్రయోగ వేదిక నుండి జి ఎస్ ఎల్ వి ఎఫ్ 15 ను ప్రయోగించుకున్నారు. జియో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఆర్బిటాల్ కక్షలోకి చేరుకునే నేవిగేషన్ సిస్టం సంబంధించి ఎన్ వి ఎస్ 02 ఉపగ్రహం ద్వారా భారతలో మెరుగైన జిపిఎస్ తరహ నేవీగేషన్ సిస్టం అందుబాటులోకి ఈ ప్రయోగం ఉపయోగ పడుతుందని ఇస్రో వర్గాలు తెలిపాయి. భారత భూభాగంతో పాటు భారత భూభాగంలోనే తీరం నుండి 1500 కిలోమీటర్ల వరకు ఈ నేవిగేషన్ సిస్టం అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా ఆకాశంలోనను, జలమార్గంలోనూ రోడ్డు మార్గాలకు దశ దిశ నిర్దేశం ఈ ప్రయోగం చూపుతుంది. ఇస్రో చైర్మన్ గా నారాయణన్ పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం జరుగుతున్న మొదటి ప్రయోగం కావడంతో ఈ ప్రయోగంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. భారతదేశానికి వన్నెతెస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా చరిత్రను తిరగరాయాలన్న చరిత్రను సృష్టించాలన్న శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్ ప్రపంచ దేశాలకు సాటిలేని మేటిగా ప్రపంచ దేశాలైనటువంటి అమెరికా రష్యా యూరోపియన్ చైనా లాంటి దేశాల సరసన చేరిన భారత్ ప్రపంచంలో నావిగేషన్ విధానాన్నికి శ్రీకారం చుట్టడం ఉంది. ఇప్పటివరకు రూపొందించినటువంటి ప్రపంచ దేశాలు అమెరికాలో జిపిఎస్ రష్యాలో గ్లోనాస్ యూరోపియన్ లో గెలీలియో అదే విధంగా చైనాలో బైదో అనేటువంటివి ఇప్పటివరకు నావిగేషన్ విధానాన్ని అందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఐదవ దేశంగా భారతదేశం వాటి సరసన చేరి నావిగేషన్ విధానాన్ని అభివృద్ధి పరచడంలో ఎంతో చాకచక్యంగా విజయవంతంగా ప్రయోగాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇప్పటివరకు 99 ఉపగ్రహాలను ప్రయోగించి ఉండగా అందులో పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఏఎస్ఎల్వీ లాంటివి ఎన్నో ఉన్నాయి అయితే ఈరోజు ప్రయోగించపోయేటువంటి ఉపగ్రహం జి ఎస్ ఎల్ వి ఎఫ్ 15 ఎన్ వి ఎస్ జీరో టు ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి 28వ తేదీ ఉదయం మధ్యాహ్నం రెండు గంటల 53 నిమిషాలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై 27 గంటల 30 నిమిషాల పాటు కొనసాగి కౌంటింగ్ ప్రక్రియ మగసి 29వ తేదీ అనగా బుధవారం ఉదయం 6 గంటల మూడు నిమిషాలకు జిఎస్ఎల్వి ఎఫ్15 ఎన్ వి ఎస్-02 ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి నిప్పులు చెరుగుతూ విజయవంతంగా ఆనంద హీళ్లి హర్షధానాల నడుమ ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం కేంద్రం సైకిల్ మీద రాకెట్ భాగాలను మోసుకెళ్లిన దశ నుండి ప్రపంచ దేశాల ఉపగ్రహాలను శ్రీహరికోట నుండి ప్రయోగించే దిశ వరకు చేరినటువంటి ఘనత భారతదేశానికి భారతదేశ పౌరులకి భారత దేశ సైంటిస్టులకు దక్కుతుందని శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్ గర్వంగా చెబుతుంది శ్రీహరికోట ఇప్పటివరకు 99 రాకెట్లను ప్రయోగించి ఉండగా అందులో 89 రాకెట్లు విజయవంతంగా ప్రయోగించడం జరిగింది అంటే దాదాపుగా 99% విజయవంతంగా చేసినటువంటి ఘనత ప్రపంచ దేశాల్లో భారతదేశానికి దక్కుతుందని ఇది షార్ కు మరో పెద్ద మైలురాయి అంతేకాకుండా గతంలో షార్ అంతరిక్ష పరిశోధన సంస్థ ద్రవ మరియు ఘన ఇంధనాల కోసం ప్రపంచ దేశాలపైన ఆధారపడేటువంటిది అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రస్తుతం వాటిని సొంతంగానే తయారు చేసుకునేటువంటి సామర్ధ్యం వరకు వచ్చింది అని అంటే శ్రీహరికోట ఏమాత్రం అభివృద్ధి చెందింది అన్న విషయాన్ని మనంగమనించవచ్చు ప్రస్తుతం ప్రయోగించబడేటువంటి జిఎస్ఎల్వి ఎఫ్ 15 ఎన్విఎస్ – 02 ఉపగ్రహం ద్వారా భారతదేశానికి అనేక ప్రయోజనాలు సమకూర్తున్నాయని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. భారతదేశంలో ఉపగ్రహాలు ఈ జి ఎస్ ఎల్ వి ఎఫ్ 15 ద్వారా సముద్రంలో 15000 కిలోమీటర్ల మేర నావిగేషన్ విధానం పనిచేస్తుందని అంతేకాకుండా నౌకాయానానికి విమానయానానికి పౌరా సైనిక విధానానికి వ్యవసాయానికి అత్యవసర సేవలు మొబైల్ సేవలు మొబైల్ లొకేషన్ లాంటి సేవలను అందిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ ఉపగ్రహం 100వ ఉపగ్రహం కావడం వలన కచ్చితంగా విజయవంతం చేయుటకు అనేక ఏర్పాట్లు చేస్తూ ప్రతి దాన్ని పరిశీలిస్తూ శాస్త్రవేత్తలు ఎక్కడ చిన్న లోపం కూడా ఉండకుండా సరిచేస్తూ సక్రమంగా కచ్చితంగా విజయవంతం అయ్యేందుకు సాయి శక్తుల ప్రయత్నిస్తున్నారు.ఈ ప్రయోగం విజయవంతం తో షార్ కేంద్రంలో 100 ఉపగ్రహాల ప్రయోగం పూర్తి అవుతుంది.