నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీఎస్పీ ఎం. సూర్య నారాయణ రెడ్డి
ప్రభాతదర్శిని,(గూడూరు -ప్రతినిధి): నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తప్పవని డీఎస్పీ ఎం. సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డు, హాస్పిటల్ రోడ్డు ప్రాంతాలలో ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఆపి ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం చేయరాన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతి ఒక్క వాహనచోదకుడు తప్పనిసరిగా వారి వాహనాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. అనంతరం పలు ఆటోల ను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. ఆయన వెంట పట్టణ సీఐ పాపారావు, ఎస్ఐ శ్రీహరిబాబు, సిబ్బంది ఉన్నారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.