ప్రకాష్ నాయుడుకి పదవి ఎప్పుడు వరిస్తుందో?
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):అతనికి తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం…పార్టీ ఏ కార్యక్రమానికైనా పిలుపునిస్తే ఎన్ని పనులు ఉన్నా వదులుకొని పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందు ఉంటాడు… అలాగని పార్టీ పదవుల కోసం, కాంట్రాక్టర్ పనుల కోసం ఆయన చాలా దూరంగా ఉంటారు… పార్టీ నష్టపోతున్న పార్టీని, నష్టపోయే విధంగా వ్యవహరించిన నిర్మొహటంగా ఖండించడం అతని నైజం. పార్టీ కష్ట కాలంలో ఎన్నో ఇబ్బందులు, బెదిరింపులు వచ్చిన అదరక బెదరక పార్టీ కోసం తన పరిధిలో ఏం చేయాలో చేసి తన ఏంటో నిరూపించుకున్న నిఖారమైన పసుపు కార్యకర్త అని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు లతో నేరుగా మాట్లాడే చనువు, అవకాశం ఉన్న అహంకారాన్ని దూరంగా పెట్టి సామాన్య కార్యకర్తగా గా ఉండటం అతనిలోనే విశేషం. అతనే మాచవరం గ్రామానికి చెందిన పాదర్తి ప్రకాష్ నాయుడు. చిరుప్రాయంలోనే చిరు వ్యాపార వేత్తగా తన జీవితాన్ని ప్రారంభించిన ప్రకాష్ నాయుడు అంచలంచలుగా ఎదుగుతు, ఒదిగి ఉంటున్న ఉంటూ టిడిపి అగ్ర నాయకుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. తన వ్యాపారాన్ని పలు విధాలుగా విస్తరించుకుంటూ తానే స్వయంగా వ్యాపారం చూసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే అతనికి మక్కువ ఎక్కువ. మరో విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అంటే పిచ్చి. పిచ్చో లేక మక్కువతోను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గత 25 సంవత్సరాల నుండి ప్రత్యక్షంగా, పరోక్షంగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే ప్రకాష్ నాయుడు పార్టీ కార్యకర్తలు అన్న నాయకులన్న ఎనలేని గౌరవం, అభిమానం, పార్టీలో వర్గ విభేదాలు సృష్టించిన ప్రోత్సహించిన, తాను జీర్ణించుకోలేడు. నిర్మోహటంకంగా తన అభిప్రాయాన్ని తెలియజేప్పి వర్గ రాజకీయాలకు దూరంగా ఉంటారు. గత ఐదేళ్లలో వైసిపి అధికారం ఉన్నప్పుడు ఎన్నో బెదిరింపులు, నిర్బంధాలు ఎదుర్కొన్న తాను మాత్రం టిడిపిని వదలని విక్రమార్కుడు. టిడిపి యువ నేత లోకేష్ బాబు చేపట్టిన యువ గళం పాదయాత్రలో ప్రకాష్ నాయుడు ఓజిలి మండలంలో ఆ కార్యక్రమం విజయవంతం కావడంలో వెనుక నుండి ఎనలేని కృషి చేశారు. పార్టీ కార్యక్రమంపై కమిట్మెంట్ అయితే ఆ కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా కృషి చేయడంలో నిద్రపోరని ఆ పార్టీ నాయకులు శ్రేణులు కితాబు ఇవ్వడం విశేషం. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రకాష్ నాయుడు సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ నెలవల విజయశ్రీ గెలుపుకు ఎంతో కృషి చేశారు. అలాగే ఎమ్మెల్యే విజయోత్సవ సభను కూడా తనదైన శైలిలో నిర్వహించి టిడిపి నాయకులు చేత శభాష్ అనిపించుకున్నారు. ఇన్ని మంచి క్వాలిటీ ఉన్న సీనియర్ నాయకునికి మరి ఎందుకో పార్టీ సరైన పదవిని నేటికీ ఇవ్వకపోవడం పై ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తుపెట్టుకుని సరైన సమయంలో సరైన పదవులు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు కార్యరూపం దాల్చితే, ఓజిలి మండలంలో ప్రస్తుతం ఉన్న టిడిపి నాయకులలో నికార్సైన పసుపు కార్యకర్త అయిన పాదర్తి ప్రకాష్ నాయుడు కు రానున్న రోజులలో ఎలాంటి పదవి వరిస్తుందో వేచి చూడాల్సిందే.
టిడిపి అంటే ప్రాణం… వివాదాలకు దూరం…
Related Posts
నేడు తెలుగు వారి గాన సరస్వతి గాయని సుశీలమ్మ 89వ జన్మదినం
ప్రసిద్ధ గాయకురాలు పి సుశీలమ్మ పుట్టినరోజు నేడు. సినీ నీలాకాశంలో అచ్చ తెలుగు పాటల పూదోటలో పదహారణాల తేట తెనుగు సాంప్రదాయలకు, కట్టుబొట్టులతో మాతృమూర్తికి నిలువుటద్దంగా ఎదుటివారు నమస్కరించే విధంగా తలపించే సుశీలమ్మ 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90 సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు.1935 నవంబరు 13 న పులపాక ముకుందరావు(క్రిమినల్ లాయర్)శేషావతారం పుణ్యదంపతులకు విజయనగరం లో జన్మించారు.విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో డిప్లమో ఇన్ మ్యూజిక్ లో చాలా…
Read moreబాలికలకు విద్య అత్యంత ఆవశ్యకం….బాలికలను ఎదగనిద్దాం
●కౌమార దశ ఆడపిల్లల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి.● అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా డాక్టర్ పసుపులేటి పాపారావు అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశ భవిష్యత్తు పిల్లల పై ఆధారపడి ఉంటుంది. బాల బాలికలు జాతి సంపద. సమానత, స్వేచ్ఛ, గౌరవం, వారసత్వం, వ్యక్తిత్వం సార్వజనీనత వంటివి అందరికీ సమానంగా వర్తించే మానవ హక్కుల లక్షణాలు. కానీ నేటి మన దేశ పరిస్థితులలో బాలికలు వాళ్ళ హక్కులను పూర్తిగా…
Read more