కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ అరుణ కుమారి
ప్రభాతదర్శిని,(గూడూరు – ప్రతినిధి):జిఎస్టి టాక్స్ లో అనేక మార్పులు టాక్స్ వస్తున్నాయని వాటిపై వ్యాపారస్తులందరూ అవగాహన పెంచుకోవాలని నిబంధనల మేరకు ఇన్ టైం లో రిటర్న్స్ ఫైల్ చేయాలని వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ గూడూరు సర్కిల్ అరుణకుమారి సూచించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ అరుణ కుమారి జీఎస్టీ నిబంధనలపై వ్యాపారస్తులతో అవగాహన సమావేశం నిర్వహించారు టాక్స్ లకు సంబంధించి పలు అంశాలపై వ్యాపారస్తులతో చర్చించారు అసిస్టెంట్ కమిషనర్ అరుణకుమారి మాట్లాడుతూ జీఎస్టీ వచ్చిన తర్వాత నిరంతరం అనేక మార్పులు వస్తున్నాయని వ్యాపారస్తులకు వాటిపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు జీఎస్టీ కలిగిన వ్యాపారస్తులందరూ తమ ఆధార్ను లింకు చేసుకోవాలని అలాగే వ్యాపారస్తులందరూ తమ వ్యాపార సంస్థలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు దుకాణాల్లో అద్దెకు ఉంటున్న వారు తమ రెంటల్ అగ్రిమెంటును రిటర్న్స్ లో తప్పనిసరిగా ఫైల్ చేయాలని కోరారు ప్రభుత్వా నిబంధనలు ఎప్పటికప్పుడు వ్యాపారస్తులకు తెలియజేస్తామని వాటిని అందరూ అనుసరించాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ప్రమీల ,వ్యాపార యూనియన్ నాయకులు సోమిశెట్టి చెంచురామయ్య ,చంద్రశేఖర్ ,కోట సునీల్ కుమార్,సుధాకర్, భాస్కర్, ప్రసాద్,కోటా రామారావు ,రాంప్రసాద్,ఎస్ ఎల్ ఎన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.