ప్రభాతదర్శిని,( నెల్లూరు-జిల్లా ప్రతినిధి): జిల్లా గ్రామ రెవెన్యూ అధికారులు సంఘం నాయకులు శుక్రవారం జిల్లా కలెక్టర్ ను కలిశారు.ఈ సందర్భంగా జిల్లా లోని గ్రామ రెవెన్యూ అధికారులు కు సంబంధించిన వివిధ అంశాలను, సమస్యలను జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్. కి అర్జీ ద్వారా విన్నవించారు. జిల్లా లోని వివిధ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న వి ఆర్ ఒ లకు రెవెన్యూ సంబంధిత పనులు అధికంగా ఉన్నాయి, అయినప్పటికి ఖాళీ ఇంటి స్థలం లకు పన్ను [వి ఎల్ టి] వసూలు కు వి ఆర్ ఒ లను వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ లు డ్యూటీ లు వేశారు. నీటి తీరువ వసూలు, నీటి సంఘాల ఎన్నికలు కు ఓటర్లు జాబితా తయారీ, రీ సర్వే గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు, చుక్కల భూములు, ఫ్రీ హోల్ అసైన్డ్ మెంట్ తదితర పనులలో తీరిక లేకుండా వి ఆర్ ఒ లు పని చేస్తున్నరని, ఖాళీ ఇంటి స్థలం లకు పన్ను [వి ఎల్ టి] వసూలు పనులు నుండి వి ఆర్ ఒ లను తప్పించాలని జిల్లా కలెక్టరు ని కోరగా వెంటనే వారు సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పంట అశోక్ కుమార్ రెడ్డి, కార్యదర్శి దారా రమణయ్య, డివిజన్ అధ్యక్షుడు యం నాగేశ్వరరావు, కార్యదర్శి తిరుమల రాజు, వి ఆర్ ఒ లు జగదీష్, రవి శేఖర్, రాజగోపాలు, విష్ణు, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.