ప్రభాతదర్శిని (తిరుపతి- జిల్లాప్రతినిధి):రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో పతకాలు సాదించిన బాల బాలికలను అభినందిస్తూ జాతీయ స్థాయిలో పతకాలుసాధించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వ ర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు ఈ నెల 3 నుండి 5 వరకు కృష్ణ జిల్లా,నన్నులో నిర్వహించిన 68 వ రాష్ట్ర స్థాయి కుస్తి పోటీలలో విజేతలైన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి లో నే కాకుండా జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలలో రాణించాలని, కుస్తీ పోటీలలో విజేతల బాలబాలికలకు వారు సాధించిన మెడల్స్ ను,మేమంటోలను అందజేసి వారి అభినందించి బాల బాలికలతో గ్రూప్ ఫొటో దిగారు. జిల్లా క్రడా అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్ మాట్లాడుతూ ఈ నెల 3 నుండి 5 వరకు కృష్ణ జిల్లా, నున్న లో నిర్వహించిన 68 వ రాష్ట్ర స్థాయి కుస్తి పోటీలలో జిల్లా నుండి అండర్ 14 సం, అండర్ 17 సం, అండర్ 19 విభాగాలలో బాల బాలికలు పాల్గొని, 24 బంగారు,19 వెండి,19 కాంచ పథకాలు సాధించారని,రాష్ట్ర స్థాయి లో అండర్ 17 మరియు అండర్ 19 బాలురు మరియు ,అండర్ 14,అండర్ 19 బాలికలు ఓవర్ అల్ ఛాంపిన్ గా నిలిచారు.వీరి లో 24 మంది బాల బాలికల ఎస్ జి ఎఫ్ జాతీయ స్థాయి లో నిర్వహించే పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 23 నుండి 27 వరకు మెరిట్ ఉత్తరప్రదేశ్ రాష్టంలో నిర్వహించే ఎస్ జి ఎఫ్ జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు అర్హత సాదించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి శేఖర్,కుస్తీ కోచ్ ఉదయ్, డి ఎస్ ఏ కోచ్ లు సుమతి,వినోద్,మహజీజ్,ప్రేమనాద్,కుస్తీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.