ప్రభాతదర్శిని, (సత్యవేడు- ప్రతినిధి): సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గెలుపుతో పుత్తూరు టీబీ రోడ్డులో ఉన్న శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో లక్ష్మణ్ రాజు తమ మొక్కుబడిని తీసుకున్నారు. ఎన్నికల సమయంలో పుత్తూరుకు చెందిన లక్ష్మణ రాజు సత్యవేడు ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం విజయం సాధిస్తే షిర్డి సాయినాథునికి నూటొక్క కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటానని మొక్కుకున్నారు. సత్యవేడు ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం గెలుపొందడంతో శనివారం ఉదయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి పుత్తూరు టీబీ రోడ్డులోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయానికి లక్ష్మణ రాజు చేరుకొని స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నూటొక్క కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రాజు, టిడిపి సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, అములు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కోనేటి ఆదిమూలం గెలుపుతో మొక్కులు చెల్లించుకున్న లక్ష్మణ్ రాజు
Related Posts
ఏ.సి.బి వలకు చిక్కిన అవినీతి అనకొండ
మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…
Read moreసీనియర్ జర్నలిస్ట్ వెంకటేశులుకు సన్మానం
ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి):జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాళహస్తి నియోజకవర్గం “ప్రభాతదర్శిని-ప్రతినిధి” చెన్నూరు వెంకటేశులును నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్చి తలపా దామోదర్ రెడ్డి తన కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించ్చారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా ఆయన “ప్రభాతదర్శిని” నియోజకవర్గ ప్రతినిధి చెన్నూరు వెంకటేశులు ను ఘనంగా సన్మానించ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం పిసిసి అధ్యక్షురాలు…
Read more