ప్రభాతదర్శిని,(జగిత్యాల జిల్లా ప్రతినిధి):జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డిప్యుటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆఫిసోద్దీన్ 4,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పల్లెపునరేష్ అనే వ్యక్తి కథలాపూర్ మండలం ఇప్పపల్లి వద్ద మామిడి తోటలో చెట్లు కోస్తుండడంతో పర్మిషన్ నిమిత్తం అధికారులను సంప్రదించగా పదివేలు డిమాండ్ చేయడంతో అవాక్కయ్యానని అన్నారు. 5వేలు చెల్లించినప్పటికీ మిగతా 5000 ఇవ్వాలని కోరడంతో ఏసీబీ అధికారులను సంప్రదించి వారి సమక్షంలో 4500 అందించగా ఏసీబీ అధికారులు ఫారెస్ట్ అధికారి ఆపిసోద్దీన్ ను అరెస్టు చేశారని అన్నారు.