ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, నెల్లూరు క్షేత్ర కార్యాలయం ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నెల్లూరు రంగనాయకుల పేటలోని పి.ఎం.ఆర్. మున్సిపల్ హైస్కూల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, తొలి రోజు నవాబు పేటలోని ఎం.సి.హెచ్.ఎస్. ప్రత్తి వారి పాఠశాల, పప్పుల వీధిలోని వై.వి.ఎం.సి.హచ్. స్కూల్ (సత్రం బడి)లోనూ మొక్కలను నాటారు. అనంతరం ఆసక్తి గల విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. వారధి ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి సంరక్షణ సహకారం అందిస్తుండగా, శుభమస్తు షాపింగ్ మాల్, పెరుమాళ్ సిల్క్స్ సహకారాన్ని అందిస్తున్నారు. లాయర్ పత్రిక, యాక్ట్ ఛానల్, రెడ్ ఎఫ్.ఎం.లు మీడియా పార్ట్నర్ లుగా వ్యవహరిస్తున్నాయి. సామాజిక వనవిభాగం, నెల్లూరు డివిజన్ సహకారంతో వందలాది మొక్కలను రానున్న నెల రోజుల్లో నెల్లూరులోని అన్న పాఠశాలల్లో నాటుతున్నట్లు భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారి పరవస్తు నాగసాయి సూరి ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యార్థులు మొక్కలు నాటడం పట్ల ఆసక్తి చూపుతున్నారని, అవకాశం ఉన్న ఇంటిలోనూ పెంచేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో మొక్కలు నాటటమే కాకుండా ప్రతి తరగతికి ఒక మొక్క సంరక్షణ బాధ్యతలు అప్పగించటంతో పాటు, మొక్క ఓ స్థాయి వరకూ పెరిగే దాకా వారధి ఫౌండేషన్ పర్యవేక్షిస్తుందని సంస్థ చైర్మన్ శ్రీరంగనాథ్, కార్యదర్శి ఆర్కాట్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం నాడు మూడు పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు విద్యార్థులు, అధ్యాపకులు ఆసక్తిగా పాల్గొన్నారు.
అమ్మ పేరిట ఒక మొక్క…నెల్లూరులో ప్రారంభమైన వన మహోత్సవం
Related Posts
క్రీడలు శారీరిక మానసిక ఉల్లాసానికి అవసరం
ఇంటర్-కాలేజియేట్ టోర్నమెంట్ ముగింపులో ఎస్వీయూ వైస్ ఛాన్సలర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): క్రీడలు మానసిక ఉల్లాసానికి అవసరమని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ విజయభాస్కరరావు అన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఇంటర్కాలేజియేట్ పురుషుల క్రీడల టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు…
Read moreప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యం
స్కూళ్లపై పర్యవేక్షణకు క్లస్టర్ విధానంవిద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే సమీప పాఠశాలల్లో విలీనంపాఠశాల విద్యలో మార్పు కార్యక్రమంలో కమిషనర్ : రాష్ట విద్యాశాఖ డైరెక్టర్ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): పాఠశాలలపై పర్యవేక్షణ పెంచేందుకు క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. సోమవారం స్థానిక మహతి ఆడిటోరియంలో పాఠశాల విద్య బలోపేతం, నూతన విద్యా విధానం పై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తిరుపతి, చిత్తూరు…
Read more