• July 18, 2024
  • 1 minute Read
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్ఐ లపై వేటు:డి.ఐ.జి. విజయారావు

ప్రభాతదర్శిని (కర్నూలు -ప్రత్యేక ప్రతినిధి):విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్ఐలపై డి.ఐ.జి. విజయారావు వేటు వేశారు. నంద్యాల జిల్లా, ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక అదృశ్యం ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా క్రమశిక్షణ ఉల్లంఘించిన ఇద్దరు పోలీసు ఉద్యోగులను కర్నూల్ రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు బుధవారం సస్పెండ్ చేశారు. ఇందులో భాగంగా నందికొట్కూరు రూరల్ సీఐ విజయ భాస్కర్, ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ ఎస్సై ఆర్. జయశేఖర్ లపై వేటు వేస్తూ కర్నూల్ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కర్నూలు రేంజ్ డిఐజి హెచ్చరించారు.రాష్ట్ర వ్యాప్తంగా…

Read more

  • July 18, 2024
  • 1 minute Read
ఇంజనీరంగ్ తొలి విడతలో 1,17,136 సీట్లు భర్తీ:డాక్టర్ నవ్య

జులై 19 నుండి ప్రారంభం కానున్న తరగతులుమలివిడత కోసం మిగిలి ఉన్న సీట్లు 19,524తదుపరి దశలో క్రీడా, ఎన్ సిసి కోటా సీట్ల భర్తీప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈఎపిసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా బుధవారం తొలివిడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. విధ్యార్ధులు జులై 22వ తేదీ లోపు తమకు నిర్దేశించిన కళాశాలల్లో ఆన్ లైన్ రిపోర్టింగ్ తో పాటు, వ్యక్తిగతంగా కళాశాలలో నమోదును పూర్తి చేయవలసి ఉందన్నారు. అయితే జులై 19 నుండే తరగతులు ప్రారంభం అవుతాయని వివరించారు. అర్హత పొందిన 1,86,031 మందిలో తొలి విడత కౌన్సిలింగ్ కోసం 1,28,619…

Read more

  • July 17, 2024
  • 1 minute Read
నూతన పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలం: జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్ వెంకటేశ్వర్

యువతకు మెరుగైన ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలిప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలనీ, నూతన పరిశ్రమల స్థాపనకు తిరుపతి జిల్లా అనుకూలమైన జిల్లా అని జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్ వెంకటేశ్వర్ పరిశ్రమల శాఖ అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పరిశ్రమల శాఖ, ఏపీఐఐసి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తూ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలనీ, నూతన పరిశ్రమల…

Read more

  • July 13, 2024
  • 1 minute Read
సమర్ధవంతమైన అధికారికి కీలక బాధ్యతలు

అబ్కారీ, గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనాఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ఎన్నికల నిర్వహణఅత్యధిక పోలీంగ్ శాతం నమోదుతో చరిత్ర సృష్టించిన వైనంప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్  అబ్కారీ, గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా గురుతర బాధ్యతలలో ఉన్న మీనాను కేంద్ర ఎన్నికల సంఘం రీలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కీలక బాధ్యతలు అప్పటిస్తూ జి.ఓ. ఎం.ఎస్: నెంబర్ 1250 జారీ చేసింది. 1998వ సంవత్సరం ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన మీనా అత్యంత సమర్ధుడైన అధికారిగా గుర్తింపు పొందారు. తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా నిపుణతతో…

Read more

  • July 13, 2024
  • 1 minute Read
అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగ అస్త్రమే ఓటుహక్కు!

– పాలకులు ఇది మరిస్తే దండన తప్పదుప్రముఖ పత్రికా సంపాదకులు సతీష్ చందర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): చరిత్ర నిద్రా సముద్రం నుంచి పెను తుపానులా లేవగల అస్త్రం రాజ్యాంగమనేది ఒకటుందనే విషయాన్ని పాలకులు, ప్రజలు మరువరాదని ప్రముఖ పత్రికా సంపాదకులు సతీష్ చందర్ అన్నారు. గుంటూరులో శనివారం బ్లూ వింగ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యాన గోరంట్లలోని డి స్క్వేర్ కన్వెన్షన్ హాల్లో ‘రాజ్యాంగమే ప్రతిపక్షమా? (జడ్జిమెంట్ 2024)’ అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన తొలి సెషన్ ‘లోక్ సభలో సంకీర్ణం రాజ్యాంగ విజయమేనా?’, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్ ‘తెలుగు రాష్ట్రాల ఫలితాలలో కుల…

Read more

  • July 13, 2024
  • 1 minute Read
కోనేటి ఆదిమూలం గెలుపుతో మొక్కులు చెల్లించుకున్న లక్ష్మణ్ రాజు

ప్రభాతదర్శిని, (సత్యవేడు- ప్రతినిధి): సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గెలుపుతో పుత్తూరు టీబీ రోడ్డులో ఉన్న శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో లక్ష్మణ్ రాజు తమ మొక్కుబడిని తీసుకున్నారు. ఎన్నికల సమయంలో పుత్తూరుకు చెందిన లక్ష్మణ రాజు సత్యవేడు ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం విజయం సాధిస్తే షిర్డి సాయినాథునికి నూటొక్క కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటానని మొక్కుకున్నారు. సత్యవేడు ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం గెలుపొందడంతో శనివారం ఉదయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి పుత్తూరు టీబీ రోడ్డులోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయానికి లక్ష్మణ రాజు చేరుకొని స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నూటొక్క కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ…

Read more

  • July 12, 2024
  • 1 minute Read
ఆక్రమణలో ఉన్న ఐదు కోట్ల ప్రభుత్వ స్థలం స్వాధీనం

ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆక్రమణలో ఉన్న ఐదు కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆ ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సేకరించిన సమాచారం, అధికారుల వివరాల ప్రకారం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు వద్ద ఎల్ ఏ సాగరం గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 65-7సి1 లో ఆక్రమణలో ఉన్న సుమారు 5 కోట్ల రూపాయల విలువ 8 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని నాయుడుపేట మండల వి ఆర్ ఓ లు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అదే సర్వే నంబర్ లో పట్టా స్థలాన్ని కొనుగోలు చేసిన ఓ…

Read more

  • July 12, 2024
  • 1 minute Read
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు

సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ 12.07.2024న జీవో యం.యస్ నెం. 82 ను జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం (డబ్ల్యూ. జే. హెచ్.ఎస్) పొడిగింపునకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు. జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ. 2 లక్షల వరకు విలువ చేసే వైద్యసేవలు అందుతాయని, ఇలా…

Read more

  • July 12, 2024
  • 1 minute Read
మెరుగైన విద్యా బోధనతోపాటు నాణ్యమైన ఆహారం అందించాలి

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణివిద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. పాలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసారు. మధ్యాహ్నం భోజనంను స్వయంగా రుచి చూసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ 10వ తరగతి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలన్నాటు. సబ్జెక్టు బాగా నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి ఉపయోగం ఉంటుందని విద్యార్థులకు ఆమె సూచించారు. మధ్యాహ్నం భోజనం పథకం మెనూ బోర్డులను పరిశీలించి మెనూ ప్రకారం భోజనాలు విద్యార్థులకు…

Read more

  • July 12, 2024
  • 1 minute Read
18 నుండి ఆగస్టు 2వ తేదీ వరకు ఇంటింటా కుష్టు వ్యాధి సర్వే

ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):ఈనెల 18వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు ఇంటింటా కుష్టు వ్యాధి సర్వే చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, మరియు జిల్లా కుష్టు ఎయిడ్స్ మరియు టీ.బి అధికారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని వైద్యాధికారులందరికీ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీహరి ప్రారంభించారు. జిల్లాలోని ఆశ, మగ వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి చర్మం మీద స్పర్శ లేని మచ్చలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి వారి వివరాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్యాధికారి దగ్గర పరీక్ష చేయించి వాటికి సంబంధించిన చికిత్సను అందించాలన్నారు. దీనికోసం వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో…

Read more

error: Content is protected !!