వర్షాకాలం వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్త గా ఉండాలి… నాయుడుపేట హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చంద్రకళ
1 min read
వర్షాకాలం వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్త గా ఉండాలి
నాయుడుపేట హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చంద్రకళ
ప్రభాతదర్శిని,(నాయుడుపేట-ప్రతినిధి): వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్త గా అప్రమత్తంగా ఉండాలని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం చంద్రకళ సూచించారు. శుక్రవారం ఆమె ‘ప్రభాతదర్శిని-ప్రతినిధి’తో మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా టైఫాయిడ్ పచ్చకామెర్లు వంటివ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. వీటి పట్ల అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా మురికి నీరు నిలువ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వర్షపు నీరు నిలువతో దోమలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. తద్వారా డెంగ్యూ మలేరియా చికెన్ గునియా టైఫాయిడ్ పచ్చకామెర్లు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా కిటికీలు తలుపులు తెరవకుండా మూసి ఉంచుకోవాలన్నారు. ప్రజలు మంచినీటిని కాచి వడపోసుకుని తాగాలన్నారు. ద్వారా వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నివారించవచ్చు అన్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో చిన్నపిల్లల విషయంలో తగిన జాగ్రత్త వహించాలన్నారు. నునువెచ్చని వాతావరణం కల్పించడంతోపాటు, తడిగుడ్లను తీసివేసి, పొడి గుడ్డలను కప్పి చిన్న పిల్లలకు వెచ్చదనాన్ని కల్పించాలన్నారు. నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అన్ని సౌకర్యాలతో వైద్య సేవలు అందించే అవకాశం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా పేద బాలింతలకు కాన్పులు చేసేందుకు తాము అన్నివేళలా అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. ఇటీవల చెంగాలి అనే గర్భిణీ ఐదో కాన్పులో కాన్పు క్రిటికల్ గా ఉన్న విషయాన్ని అంగన్వాడి టీచర్ తన దృష్టికి తీసుకురాగా నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు కాన్పు చేస్తామని వివరించారు.