Sample Name

Senior Journalist

Sample Name

Reporter

November 2023
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
December 8, 2023

Prabhatha Darsini

Telugu Daily

ఏసీబీ వలలో రెవెన్యూ చేపలు…. తాళ్ళపూడిలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డి.టి, విఆర్ఓ

1 min read

ఏసీబీ వలలో రెవెన్యూ చేపలు

తాళ్ళపూడిలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డి.టి, విఆర్ఓ

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):అవినీతి నిరోధక శాఖ వలలో రెవెన్యూ అధికారులు చిక్కారు.
తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండల రెవిన్యూ సిబ్బందిపై ఏ.సి.బి వేసిన వలలో డిప్యూటీ తహసీల్దార్ , మరియు వి.ఆర్.ఓ లు 7 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం ఏ.సి.బి ఆడిషనల్ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో మలకపల్లి సచివాలయంలో వి.ఆర్.ఓ పై నిఘా ఉంచారు. మలకపల్లి గ్రామానికి చెందిన జి.వీర్రాజు అనే రైతు తన తండ్రికి సంబంధించిన 10 సెంట్లు భూమి (22ఏ ) ప్రభుత్వ భూమిగా నమోదు అయిందని, లోన్ కోసం బాంక్ కు వెళ్లేందుకు తన భూమి వివరాలు సరి చేయాలని విఆర్ఓ శ్రీనివాస్ ను కోరారు. డిప్యూటీ తహసీల్దార్ ను కలవమన్నారని, ఆయన ఈ పని చేసేందుకు చాలా విధానం ఉందని, తహసీల్దార్ కు చెప్పి ప్రత్యామ్నాయంగా సర్టిఫికెట్ ఇప్పిస్తామని, అది లోన్ కు వినియోగపడుతుందని, ఈ పని కోసం 10 వేలు ఖర్చు అవుతుందని తెలిపారని, చివరకు 7 వేల రూపాయలు ఇస్తే చేస్తామని ఒప్పదం కుదుర్చుకుని మలకపల్లి సచివాలయం వద్ద డబ్బు పుచ్చుకున్నారని ఆమె తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఆఫీసు కు వెళ్లిన డిప్యూటీ తహసీల్దార్ ను విఆర్ఓ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా పని కోసం లంచం అడిగితే 14400 కి కాల్ చెయ్యండి లేదా రాజమహేంద్రవరం లో గల ఆఫీస్ లో నేరుగా పిర్యాదు చేయవచ్చని సౌజన్య తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!