సైదాపురం మైనింగ్ మాఫియా పై మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆగ్రహం
1 min readసైదాపురం మైనింగ్ మాఫియా పై మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆగ్రహం
-అధికారుల నిర్లక్ష్యంతో యదేచ్చిగా అక్రమ మైనింగ్ లు
-తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో మైనింగ్ లు
– అక్రమ మైనింగ్ ల పై ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తా
ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి):నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో పెట్రేగిపోతున్న మైనింగ్ మాఫియా పై రాష్ట్ర మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సైదాపురం మండలంలో ప్రభుత్వ ఆదాయాన్ని కి గండిగుడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చలవిడిగా అక్రమంగా మైనింగ్ చేస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై మాజీ మంత్రి మండిపడ్డాడు. సోమవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ
టిడిపి సర్పంచులు ఉన్న గ్రామాల్లోనే 80% ఆక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. మా పార్టీ నాయకులు కూడా 20% మాత్రమే చేసేవారు ఉండవచ్చన్నారు. కానీ టిడిపి నాయకులు అధికారుల అండదండలతో మైనింగ్ మాఫియాగా పెట్రేగి పోతున్నారు. సైదాపురం నా నియోజకవర్గ పరిధి కాదు. అయినా నా పైనా, వైసిపి ప్రభుత్వం పైనా బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు. వాస్తవాలు చెప్పదలుచుకున్న మండలంలో అధికంగా ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న నాయకులు తెలుగుదేశం పార్టీ వారు కాదా…? జోరేపల్లి, తలుపుూరులో అనుమతులు ముగిసినా అక్రమమైనింగ్ చేయడం లేదా… ?ఒకవేళ వైసిపి వారు ఆక్రమ మైనింగ్ చేస్తుంటే సర్పంచులు గా ఉన్న గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు గాడిదలు కాస్తున్నారా..? రాపూర్ సిఐ, సైదాపురం తహసీల్దార్ ల ప్రోత్సాహంతోనే మైనింగ్ మాఫియా యధేచ్చగా జరుగుతుంది. కొంతమంది అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అలాంటి అధికారుల్లో వీరిద్దరూ ఉన్నారు. తమ పొలాల్లోని మెటీరియల్ టిడిపి వారికి ఇవ్వకపోతే సిఐ రైతులను ఆ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న వాహనాలను వైసిపి వారు అడ్డుకుంటే సీఐ స్వయంగా వచ్చి వాటిని సాగనంపారన్నారు. తెలుగుదేశం పార్టీ వారితో కలిసి మెలిసి సిఐ పనిచేస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణ. వైసిపి వారే అంతా చేస్తున్నారని భ్రమ కల్పించేలా రాతలు రాస్తున్నారు. గత ఆరు నెలలుగా ఎక్కడి నుంచి ఎంతెంత మెటీరియల్ తరలించారో సాక్షాలతో సహా వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విషయాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తా. మీడియా చర్చ కైనా సిద్ధం. సిటీ ఎమ్మెల్యేను అయినా జగన్ కు, ప్రభుత్వానికి మరక పడే పరిస్థితి వస్తే స్పందించడం నా బాధ్యత కనుక మాట్లాడుతున్న. అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
———————————————————————
కోడూరు శ్రీనివాసులు రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ బల్లి
ప్రభాతదర్శిని,(గూడూరు – ప్రతినిధి): వై.యస్.ఆర్.సి.పి సీనియర్ నాయకులు, గూడూరు మాజీ మునిసిపల్ వైస్ ఛైర్మన్ కోడూరు శ్రీనివాసులు రెడ్డి నివాసంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిసి క్షేమమాచారాలను అడిగి తెలుసుకున్నారు. కోడూరు శ్రీనివాసులు రెడ్డి దివంగత మంత్రి మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్ రావుకు ప్రాణ మిత్రుడు గా ఉంటూ ఆయనతో పాటు అనేక కార్యక్రమాలలో పాల్గొనే వారు.అదే ఆనవాయితీని ఎమ్మెల్సీ కూడా ఎప్పుడు గూడూరు కి వచ్చినకోడూరు శ్రీనివాసులు రెడ్డి నివాసానికి వెళ్ళడం ఆనవాయితీగా సోమవారం స్వయంగా కోడూరు శ్రీనివాసులు రెడ్డినివాసానికి వెళ్లి వారి యొక్క యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ వెంతవ్ వై.యస్.ఆర్.సి.పి టౌన్ ట్రెజరర్ సూరిశెట్టి హారిక్రిష్ణ డి.వి.ఎం.సి మెంబర్ వాకాటి ప్రభాకర్ వై.యస్.ఆర్.సి.పి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
———————————————————————
అన్ని దానాల కల్లా రక్త దానం మిన్న
-ప్రభాస్ అభిమాన సంఘం సేవలు బేష్…ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి
ప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి):అన్ని దానాల కల్లా రక్త దానం మిన్న అని ప్రభాస్ యువసేన ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు.సోమవారం గూడూరు పట్టణంలో ప్రభాస్ యువసేన అధ్యక్షులు యోగి అధ్వర్యంలో జరిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని ప్రభాస్ జన్మదిన పురస్కరించుకొని జన్మదిన కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సినిమా హీరో ప్రభాస్ పుట్టినరోజు వేడుక ను, ఆయన అభిమాని శ్రీనివాస్ రాజు (యోగిరాజు ) ఆధ్వర్యంలో గూడూరు పట్టణం లోని వీఎస్ఆర్ స్కూల్ లో నిర్వహించిన సందర్భంగా ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం సంతోషం గా ఉందన్నారు. ప్రతీ సంవత్సరం ప్రభాస్ పుట్టినరోజు కార్యక్రమం కచ్చితంగా చేస్తున్న యోగిరాజు ను అభినందిస్తున్నాను అన్నారు. తరువాత జన్మదిన వేడుకలో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని పరిశీలించిన అనంతరం భారీ కేక్ కటింగ్,నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ,భారీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, తానే స్వయంగా వడ్డించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి.గూడూరు పట్టణంలో కొనేటిమిట్ట ప్రాంతానికి చెందిన కరేటి అన్వేష్ అంతర్జాతీయ భారతదేశం క్రికెట్ టీంకు ప్రాతినిథ్యం వహించిన సందర్భంగా అన్వేష్ ను ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ అభినందించారు.ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్.సి.పి టౌన్ ట్రెజరర్ సూరిశెట్టి హరిక్రిష్ణ, తిరుపతి జిల్లా,డి.వి.ఎం.సి మెంబర్ వాకాటి ప్రభాకర్, గూడూరు రూరల్ ఎస్.ఐ ఎం.మనోజ్ కుమార్, వై.యస్. ఆర్.సి.పి నాయకులు పడియాల శ్రీహరి, వి.యస్.ఆర్ స్కూల్ కరస్పాండెంట్ బాలరాజు,రెట్టపల్లి సురేష్ వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.