కాలువల్లో చెత్త వేసే వారికి జరిమాన విధించండి-తిరుపతి కమిషనర్ హరిత
1 min read
కాలువల్లో చెత్త వేసే వారికి జరిమాన విధించండి-తిరుపతి కమిషనర్ హరిత
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి):తిరుపతి నగరంలో ఎక్కడైన కాలువల్లో చెత్త వేసే వారిని గుర్తించి వారికి జరీమాన విధించాలని, అదేవిధంగ రోడ్లపై భవన నిర్మాణ వ్యర్ధాలు వేసే వారికి కూడా జరిమానాలు విధించాలని అధికారులనుద్దెసించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అన్నారు. తిరుపతి నగరంలోని గంగమ్మగుడి, పెద్దకాపు లే అవుట్, జయశ్యాం థీయేటర్ పరిసరాలు, శ్రీనివాసం ముందర ఏరియాలో శనివారం ఉదయం కమిషన్ హరిత పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులకు కమిషనర్ హరిత సూచనలు చేస్తూ రోడ్లపై శానిటేషన్ కి ప్రాధాన్యత ఇచ్చి స్వచ్చ సర్వేక్షన్లో ముందుకు వెల్లాలంటె ముఖ్యంగా పరిసరాలు, కాలువలు, రహదారులు శుభ్రంగా వుండాలన్నారు. కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా శానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా వుండాలన్నారు. పెద్ద ఓపెన్ కాలువలుపై చెత్త వేయకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా భవన నిర్మాణ వ్యర్ధాలను తెచ్చి రోడ్లపై వేసేస్తున్న వారిని కూడా గుర్తించాలని, అవసరమైతే సమీప సిసి కెమెరాలను పరిశీలించి చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని, వ్యర్ధాలు వేసే వాహనాలను సీజ్ చేయాలన్నారు. శానిటేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ శానిటేషన్ వర్కర్స్ అందరూ పనిలోకి వచ్చి కాలువలు, వీధులు శుభ్రం చేస్తున్నారా అని నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. రోడ్ల ప్రక్కనున్న నిర్మాణ వ్యర్ధాలను తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేసారు. అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు, సెట్ బ్యాక్ వదలకుండ నిర్మాణాలు ఎక్కడగాని నిర్మించకుండా ప్లానింగ్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ప్లానింగ్ అధికారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశాలు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవళ్ళికా రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిప్యూటీ సిటి ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రమణ్యం, డిఈ దేవిక, శానిటరి సూపర్ వైజర్ సుమతి, వార్డ్ నాయకులు దొడ్డారెడ్డి శేఖర్ రెడ్డి, దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.