జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి
1 min read
జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి
ప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి): నేటి నుంచి (జూలై నెల) ఒకటో తేదీ నుండి 31వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారంమండలంలోని మేనకూరు సచివాలయంలో జరిగిన వాలంటీర్లకు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హత ప్రామాణికంగా పేదవారికి సంక్షేమ పథకాలు అందించడం కోసం సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం 175 సీట్లు గెలుపొందడంలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు పాలను తీసుకువచ్చి, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించడం కోసం సచివాలయగా వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. నెలరోజుల పాటు జరగనున్న జగనన్న సురక్ష పథకం కార్యక్రమంలో 11 రకాల సర్టిఫికెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలియజేశారు. వాలంటీర్లు గృహసారథులు సమన్వయంగా ప్రతిగడపకు వెళ్లి జగన్ న సురక్ష ప్రయోజనాలను ప్రజలకు వివరించి వారికి కావలసిన సర్టిఫికెట్ల వివరాలను తెలుసుకొని జులై 7వ తేదీన మేనకూరు సచివాలయంలో జరుగునున్న జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. వైసిపి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. వాలంటీర్లను ప్రభుత్వంలో సముచితస్థానం ఉంటుందని అన్నారు. మేనకూరు పంచాయతీ అభివృద్ధికి సమిష్టి నిర్ణయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కృషితో మేనకూరు లో సెజ్ ఏర్పడినట్లు తెలిపారు. దీనితో నాయుడుపేట చుట్టుపక్క ప్రాంతాలు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు.వైఎస్సార్ జ్ఞాపకార్ధం చరిత్రలో గుర్తుండిపోయేలా మేనకూరులో వైయస్సార్ స్మృతి వనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. స్మృతి వనం నిర్మాణ పనులు ఆగస్టు చివరినాటికి పూర్తి అవుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైయస్సార్ స్మృతి వనాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. వైయస్సార్ స్మృతి వనం నిర్మాణానికి సహాకరిస్తున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మేనకూరు ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. పార్టీ అంటే తల్లిగా భావించే తాను ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టనని తెలిపారు.వైసిపి పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా మేనకూరు పంచాయతీలో నూరు శాతం అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. పార్టీ గెలుపే ధ్యేయంగా పని చేస్తామన్నారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసిపికి శ్రీరామరక్ష అని అన్నారు. వాలంటీర్లు గృహసారథలు సమన్వయంగా పనిచేసే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.నాయుడుపేట మండల జెసిఎస్ కన్వీనర్ ఒట్టూరు కిషోర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయుడుపేట మండలం జడ్పిటిసి సభ్యులు కట్టా జ్యోతి రెడ్డి, ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, సర్పంచ్ సురేష్, ఎంఎల్ఓ మహమ్మద్, కార్యదర్శి ఎం గోపాల్, పలువురు వాలంటీర్లు, గృహసారథులు పాల్గొన్నారు.