2016–17వ సంవత్సరంలో ముద్రితమైన 176కోట్ల నోట్లకు లెక్కలేవి? 1999–2010 మధ్యకాలంలో ముద్రితమైన నోట్ల కంటే 33.99 కోట్ల మేర అదనపు కరెన్సీ ఆర్బీఐకి చేరిన వైనం
1 min read2016–17వ సంవత్సరంలో ముద్రితమైన 176కోట్ల నోట్లకు లెక్కలేవి?
1999–2010 మధ్యకాలంలో ముద్రితమైన నోట్ల కంటే 33.99 కోట్ల మేర అదనపు కరెన్సీ ఆర్బీఐకి చేరిన వైనం
భారత ఆర్థికవ్యవస్థలో 88వేల కోట్ల మనీ మిస్టరీ!?
మూడు మింట్‌లు ప్రెస్‌ల నుంచి ఆర్బీఐకి చేరని రూ.500నోట్లే
ఆర్టీఐ కార్యకర్త మనోరంజన్ రాయ్ వెల్లడి.. సీఈఐబీ,ఈడీకి లేఖలు
ప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి):కరెన్సీ ముద్రణాలయాల నుంచి భారత ఆర్థిక వ్యవస్థలోకి రావాల్సిన కొత్త రూ.500 నోట్లు గాయబ్ అయ్యాయి..!ఒకటికాదు..రెండుకాదు ముద్రితమైన రూ.500 నోట్లలో 176 కోట్ల నోట్లు లెక్కల్లోకి రాకుండా పోయాయి. వీటి విలువ రూ.88,032.5 కోట్లు..! ఇది జరిగింది 2016–17 మధ్యకాలంలో..! ముద్రణాలయాల్లో అచ్చయిన ఈ నోట్లు..భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)కి చేరలేదు.ఈ మొత్తం ఎవరి చేతుల్లోకి వెళ్లిందనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.మనోరంజన్ రాయ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)కింద దరఖాస్తు చేసుకోగా ఆర్బీఐ ఇచ్చిన సమాచారంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్,నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్,మధ్యప్రదేశ్ దేవస్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్‌లో రూ.500 కరెన్సీ అచ్చవుతుంది.2016 నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు జరగ్గా అంతకు ముందు నుంచే నాసిక్ ప్రెస్‌లో కొత్త రూ.500 నోట్ల ముద్రణ జరిగింది.2015 ఏప్రిల్–2016 డిసెంబరు మధ్య కాలంలో ఈ ప్రెస్‌లో ముద్రితమైన నోట్లకు, ఆర్బీఐకి చేరిన నోట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసం బయటపడిందని రాయ్ వివరించారు.2015 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబరు వరకు నాసిక్ ప్రెస్‌లో 37.54 కోట్ల మేర రూ.500 నోట్లు ప్రింట్ అయ్యాయి.వాటిల్లో 34.5 కోట్ల నోట్లు మాత్రమే ఆర్బీఐకి చేరాయి.ఈ స్థాయిలో నోట్లు మిస్సవ్వడం మామూలు విషయం కాదు.అది దేశఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరం:అని ఆయన అన్నారు.2016–17మధ్యకాలంలోనూ నాసిక్ ప్రెస్ ద్వారా 166.20 కోట్లు,బెంగళూరు మింట్ ద్వారా 519.56 కోట్లు, దేవస్ మింట్ ద్వారా195.30 కోట్ల మేర రూ.500 నోట్ల ముద్రణ జరిగింది.ఈ మూడు మింట్‌లు కలిపి 881.065 కోట్ల మేర కొత్త రూ.500 నోట్లను ముద్రించగా.. అందులో 726 కోట్ల నోట్లు మాత్రమే ఆర్బీఐకి చేరాయి. 2015–17 మధ్యకాలంలో ముద్రితమై ఆర్బీఐకి చేరని రూ.500నోట్ల సంఖ్య 176 కోట్లుగా ఉందని రాయ్ వివరించారు.ఇలా భారత ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా పోయిన/మాయమైన ఈ 176కోట్ల నోట్లవిలువ రూ.88, 032.5 కోట్లుగా ఉంటుందని తెలిపారు.ఈ ఉదంతంపై సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో(సీఈఐబీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు.రూ.88,032.5 కోట్లమేర కరెన్సీ కనిపించకుండా పోయిన ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం లేదా ఆర్బీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
అప్పట్లో సీన్ రివర్స్!:ముద్రితమైన నోట్ల సంఖ్యకు.. ఆర్బీఐకి చేరిన నోట్లకు మధ్య గతంలోనూ తేడాలు వెలుగులోకి వచ్చాయి.1999–2010 మధ్య కాలంలో ముద్రితమైన రూ.500(పాత)నోట్ల కంటే 33.99 కోట్ల మేర అదనపు కరెన్సీ ఆర్బీఐకి చేరడం గమనార్హం..! అప్పట్లో ఆర్బీఐకి రూ.500 నోట్లను డిపాజిట్ చేయడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.2000–11 మధ్య కాలంలో కూడా ప్రింటింగ్ ప్రెస్‌లు ముద్రించిన దానికంటే.. ఆర్బీఐకి ఎక్కువ మొత్తంలో రూ.1,000 నోట్లు చేరాయి.