Sample Name

Senior Journalist

Sample Name

Reporter

June 2023
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
December 8, 2023

Prabhatha Darsini

Telugu Daily

చంద్రబాబు14ఏళ్ల పాలనే ప్రజలందరికీ పెద్ద నరకం గడపగడపలో తిరుపతి ఎమ్మెల్యే భూమన

1 min read

చంద్రబాబు14ఏళ్ల పాలనే ప్రజలందరికీ పెద్ద నరకం
గడపగడపలో తిరుపతి ఎమ్మెల్యే భూమన
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి):చంద్రబాబు 14 ఏళ్ళ పాలనే ప్రజలందరికీ పెద్ద నరకమని గ్రహించిన ప్రజలే ఆయనను తరిమికొట్టారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. జగనన్న పాలనలో ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేకే నాలుగేళ్ల నరకం అంటూ నేడు కొత్తగా ప్రచారం సాగిస్తున్నాడని ఎద్దేవా చేసారు. తిరుపతి నగర పాలక సంస్థ 22వ డివిజన్లో మంగళవారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ పర్యటిస్తూ జగనన్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలో పేద ప్రజలంతా సంతృప్తికర జీవితాన్ని గడుపుతున్నారని, దాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు, ఆయనకు ఒత్తాసు పలికే పవన్ కల్యాణ్ వారిష్టమొచ్చినట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై బూతుల పంచాగాన్ని ఎత్తుకుని విషాన్ని వెళ్లగక్కుతున్నారని భూమన దుయ్యబట్టారు. చంద్రబాబు కొత్తగా నాలుగేళ్ల నరకం అనే కొత్త ప్రచార కార్యక్రమాన్ని తీసుకొచ్చడాని ఆక్షేపిస్తూ, చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ప్రజలు నరకాన్ని చవిచూశారు కాబట్టే నరకాసురుని వధించి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టారన్నారు. చంద్రబాబుకు, ఆయన్ను మోసే పెత్తందార్లకు, ఆయనకు అండగా నిలుస్తున్న ప్రతిఘాతక శక్తులకు నిజంగా జగనన్న పాలన నరకమే అని వ్యంగాస్త్రాన్ని సంధించారు. పేద ప్రజలకు మేలు చేయాలన్న జగనన్న సంకల్పం ఖచ్చితంగా పెత్తందార్లకు నరకంగా ఉంటుందన్నారు.తాను పెత్తందార్లవైపేనని, పేదలకు వ్యతిరేకమని చంద్రబాబు మరొకసారి ప్రకటించుకున్నారని భూమన స్పష్టం చేసారు. చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా, తల్లకిందులుగా తపస్సు చేసినా, ప్రజా మద్దతున్న జగన్ మోహన్ రెడ్డిని ఓడించలేరని భూమన ధీమా వ్యక్తం చేసారు. గతంలో కురిసిన వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఈ ప్రాంతంలో పర్యటించి, యుద్ద ప్రాతిపదికన రోడ్లను పూర్తి చేయాలని ఆదేశించారని భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. అందులో భాగంగా ఈ డివిజన్లో రోడ్లన్నింటినీ అత్యంత సుందరంగా నిర్మించడంతో స్థానికులు ఆనందంగా వున్నారని, దీంతో జగనన్న పాలన పట్ల ప్రజలంతా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగనన్న అధికారంలో కొనసాగాలని ప్రజలు భావిస్తున్నారని భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు.* *ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ పైడి సునీత, డిష్ చంధ్ర, కార్పొరేటర్లు మునిరామిరెడ్డి, ఆరణి సంధ్య, సి.కె.రేవతి, తిరుత్తణి శైలజ, వైసిపి నాయకులు వెంకటమునిరెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, పడమటి కుమార్, తిమ్మారెడ్డి, మబ్బు నాధమునిరెడ్డి, అనీల్, కిరణ్, మనోహర్ రెడ్డి, దేవధానం, శ్యామల, జ్యోతి ప్రకాష్, తాళ్ళూరి ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!