జగన్ బీసీలను అణగదొక్కేశాడు…జంగారెడ్డిగూడెం బీసీల సభలో చంద్రబాబు ధ్వజం
1 min read
జగన్ బీసీలను అణగదొక్కేశాడు…జంగారెడ్డిగూడెం బీసీల సభలో చంద్రబాబు ధ్వజం ప్రభాతదర్శిని, విజయవాడ-ప్రతినిధి: జగన్ బీసీలకు మాయమాటలు చెప్పి అణగదొక్కేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గురువారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన బీసీల సభలో చంద్రబాబు పాల్గొని సీఎంపై ధ్వజమెత్తారు. ‘‘బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి, రాజకీయ ప్రాధాన్యత తగ్గించారు. బీసీలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మీకు మంచి గుర్తింపు వస్తుంది. అందుకే ఆదరణ పథకం మీ కోసం అప్పుడు అమలు చేశాను. 34, 400 కోట్లు బీసీల కోసం సబ్ ప్లాన్ అమలు చేశాం. 50 శాతం జనాభా ఉన్న బీసీల కోసం జగన్ ఒక్క రూపాయి కూడా అందరి కన్నా ఎక్కువ ఖర్చు చేశాడా? 140 బీసీ కులాల కోసం ఎంత ఖర్చు పెట్టావో శ్వేతపత్రం విడుదల చేయాలి. టీటీడీలో 37 మంది మెంబర్స్ ఉంటే.. బీసీలకు ముష్టి మూడు పదవులు ఇచ్చాడు. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీ టీడీపీ. సీఎం, డీజీపీ, సీఎస్, సకల శాఖామంత్రి, సాక్షి గుమస్తా అంతా ఆయన జిల్లాకు చెందినవారే. సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల వీరేనా రాజకీయం చేసేది..? మీరు చేయలేరా? యూనివర్శిటీల్లో వీసీలనే కాదు, రిజిస్ట్రార్లను మీ వారినే వేసుకున్నారు. ఇతర కులాల వీసీలను తొలగించి మీకు నచ్చిన వారిని పెట్టుకున్నారు. ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్చి.. ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి రాజశేఖర రెడ్డి పేరు మార్చారు. జగన్ మీటింగ్‌కు రాకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. మీటింగులకు వచ్చిన ఆడపిల్లల చున్నీలను లాగేసారు. పెళ్లి కానుక లేదు, అన్న క్యాంటీన్ లేదు.. అన్ని పోయాయి. ఆయనకు బటన్ నొక్కడం మాత్రమే వచ్చు. మీ పొట్టలు కొట్టి, జగన్ తన పొట్ట పెంచుకుంటున్నాడు.’’ అంటూ చంద్రబాబు మండిపడ్డారు.