కలర్ షైన్ ఫ్యాక్టరీ కార్మికుడిది హత్యా? లేక ఆత్మహత్యా? – సంఘటన స్థలానికి జర్నలిస్టులను అనుమతించకపోవడంలో లోగుట్టు ఏమిటి? – బ్రోకరిజం చేస్తున్న పిఆర్ఓపై చర్యలు తీసుకోవాలి -మృతుడు కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియో చెల్లించాలి నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నం డిమాండ్
1 min read
కలర్ షైన్ ఫ్యాక్టరీ కార్మికుడిది హత్యా? లేక ఆత్మహత్యా?
– సంఘటన స్థలానికి జర్నలిస్టులను అనుమతించకపోవడంలో లోగుట్టు ఏమిటి?
– బ్రోకరిజం చేస్తున్న పిఆర్ఓపై చర్యలు తీసుకోవాలి
-మృతుడు కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియో చెల్లించాలి
నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నం డిమాండ్ ప్రభాతదర్శిని, గూడూరు-ప్రతినిధి: గూడూరు రూరల్ మండల పరిధిలోని మంగళపూరు పంచాయితీ తుంగపాలెం గ్రామంలో ఉన్న కలర్ షైన్ ఫ్యాక్టరీలో పని చేస్తూ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన కార్మికుని విషయంపై విచారణ జరిపించాలని నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నం డిమాండ్ చేశారు. శుక్రవారం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తం మాట్లాడుతూ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ కు చెందిన సలీం అనే కార్మికుడు మృతి చెందాడని, మృతి చెందిన విషయాన్ని గోప్యంగా ఉంచి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు అన్నారు. ఇక్కడ పి.ఆర్.ఓ ముసుగులో వ్యవహరిస్తున్న ఓ జర్నలిస్టు యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆదూరు రత్నం మాదిగ మాట్లాడుతూ మృతి చెందిన విషయాన్ని గూడూరు డివిజన్లోని జర్నలిస్టులకు ఏమాత్రం సమాచారం అందకుండా, కంపెనీ పి.ఆర్. ఓ కంపెనీ యాజమాన్యాన్ని తప్పుపట్టించడం ఎంతవరకు న్యాయమని ఆదూరు రత్నం ఆలోచించారు.. కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు సరైన భద్రత లేకుండా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు, ఎక్కడి నుంచో పొట్ట కోటి కోసం వచ్చిన కార్మికులపై ఇలాంటి వివక్షత చూపడం ఎంతవరకు న్యాయమన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత జర్నలిస్టులు కంపెనీ లోపలికి వెళ్లాలంటే కంపెనీ యాజమాన్యం అనుమతి కావాలని వెళ్లేందుకు అనుమతి లేదని గేటు వద్ద నుంచే జర్నలిస్టులను వెనక్కు పంపించడం యాజమాన్యం లోగుట్టు ఏమిటని ఆయన ప్రశ్నించారు. కంపెనీ యాజమాన్యానికి అక్కడ పిఆర్ఓ గా పనిచేస్తున్న జర్నలిస్టు ముసుగులో బ్రోకరిజం చేసే దుర్మార్గుడు తప్పుడు సలహాలే అని ఆయన ఆరోపించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులకు కార్మిక భీమా, యూనిఫామ్, ఫైర్ సేఫ్టీ, కూడా లేవనే అనుమానాలున్నాయని ఆరోపించారు. సమాజంలోని అన్యాయాలను అక్రమాలను వెలికి తీసి బహిర్గతం చేసే జర్నలిస్టులను అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కార్మికుని విషయాన్ని తెసుకున్నందుకు కంపెనీ లోపలికి అనుమతించకపోవంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కంపెనీ లోపల ఏమైనా స్మగ్లింగ్ జరుగుతుందా? అని ఆయన ప్రశ్నించారు. కంపెనీలో పనిచేస్తున్న పిఆర్ఓ పోలీస్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి కూడా తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తుందన్నారు. అక్కడ పనిచేస్తున్న పిఆర్ఓ, మృతి చెందిన కార్మికుని మరణంపై జర్నలిస్టులు ఆరా తీసే విషయం సంబంధం లేదని చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కంపెనీలో అనుమానాస్పద స్థితిలో మనిషి చనిపోతే కంపెనీకి సంబంధం ఎలా లేకుండా ఉంటుందని, కాసులకు కక్కుర్తి పడి బ్రోకర్ పని చేసే పి ఆర్ ఓ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కంపెనీలో కార్మికులకు సరైన భద్రత లేదని, అలా లేకపోవడం వల్లనే సలీం చనిపోయాడు అనే అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. కార్మికుని పోస్ట్మార్టమ్ పై కూడా అనుమానాలు ఉన్నాయని అవసరమైతే రీ పోస్ట్మార్టమ్ చేయాలని డిమాండ్ చేశారు. సలీం అనే కార్మికుని కుటుంబానికి కంపెనీ యాజమాన్యం నష్టపరిహారం 50 లక్షలు చెల్లించాలని, అలా చెల్లించని పక్షంలో, కంపెనీ యాజమాన్యమే దిగివచ్చి నష్టపరిహారం చెల్లించేలా ఉద్యమం చేస్తామని నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు పారి భాస్కర్ హెచ్చరించారు. అసలు కంపెనీలో ప్రమాదం జరిగిన వెంటనే ప్రధమ చికిత్స అందక మరణించాడని, కంపెనీలో ప్రథమ చికిత్స అందించే డాక్టర్ లేకపోవడం, అంబులెన్స్ సౌకర్యం ఉండకపోవడం దారుణమన్నారు. కంపెనీ ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు కావస్తున్న సి ఎస్ ఆర్ నిధులు ఉపయోగించి ఏ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. కార్మికులకు సరైన వసతులు కూడా లేవని ఆయన మీడియాతో చెప్పారు.ఈ కంపెనీలో ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాల వారే ఉన్నారని, స్థానికులకు అవకాశం ఇవ్వాల్సి ఉన్న 10 శాతం ఉపాధి కల్పించకపోవడం కూడా పి ఆర్ ఓ నే ప్రధాన కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు గోవిందు శంకరయ్య మాదిగ, ఉపాధ్యక్షులు పోలేపల్లి రమణారావు మాదిగ, న్యాయ సలహాదారు చిగురుపాటి పవన్ మాదిగ, బాలకృష్ణయ్య మాదిగ, కార్యకర్తలు మోహన్, కృష్ణ, కోటి, మల్లికార్జున పాల్గొన్నారు