• July 26, 2024
  • 1 minute Read
ఏపీ మద్యం కుంభకోణంలో వాసుదేవ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ

నెలన్నర రోజులుగా పరారీలో వాసుదేవరెడ్డి ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) గత ఎండీ, ఐఆర్‌టీఎస్ అధికారి డి. వాసుదేవరెడ్డి నెలన్నర రోజులుగా పరారీలో ఉన్నారు. ఇప్పటికే పలు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన కోసం సీఐడీ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వాసుదేవరెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అజ్ఞాతంలో ఉన్న ఆయన మరోవైపు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తన న్యాయవాదులతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.*అభియోగాలు ఇవే*:విజయవాడలోని ఏపీఎస్‌బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర కీలక పత్రాలు చోరీ చేశారన్న ఫిర్యాదుతో జూన్…

Read more

  • July 26, 2024
  • 1 minute Read
మీటింగ్ ల పేరుతో దండకాలు చేస్తున్న ఓజిలి చోటా నాయకుడు ఎవరు?

సరిహద్దులు దాటిన అవినీతి సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది.. ప్రభాతదర్శిని (ప్రత్యేక ప్రతినిధి):ఖరీదైన కారులో రాకపోకలు కమ్మన మాటలతో కలుపుగోలుతనం.. నాయకులు ముందు అతి వినయ విధేయతలు… అవకాశం ఉండి మైకు చేతికి ఇస్తే.. పొగడ్తలతో ముంచి వేయడం… అతనికి వెన్నతో పెట్టిన విద్య.. తన మాటల గారడితో అవతల వ్యక్తులను బూరెడి కొట్టించి అంత తానే తాను ఏమని చేయగలనని నమ్మించడంలో తనకు తాను చాటి… అధికార పార్టీ ఏదైనా ప్రైవేటు సంస్థలలో పెత్తనం చెలాయించే విధంగా, చెల్లుబాటు అయ్యే విధంగా తనకు నచ్చిన అన్ని విద్యలు ప్రదర్శించడం అతని నైజం. చూపు అమాయకంగా కనిపించిన.. చేతల్లో మాత్రం  తాను చేసే పని మరో చేతికి తెలియకుండా అంటకుండా తనొక్కడే…

Read more

  • July 25, 2024
  • 1 minute Read
మీ బాబాయి హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చెయ్యలేదు జగన్

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): జగన్మోహన్ రెడ్డి మీ బాబాయి హత్యపై ఢిల్లీలో ఎందుకు  ధర్నా చెయ్యలేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు. బుధవారం నెల్లూరు బీజేపీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ ని మర్డర్ చేస్తే ఆరోజు ధర్నా చేశారా ?? మీ వైసీపీ నాయకుల వల్ల కావలిలో కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే ఆరోజు ధర్నా చేశారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎంపీ ని దారుణంగా కొట్టి ఆధారాలు లేకుండా చేసిన ప్రభుత్వ మీది…

Read more

  • July 24, 2024
  • 1 minute Read
అమ్మ పేరిట ఒక మొక్క…నెల్లూరులో ప్రారంభమైన వన మహోత్సవం

ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, నెల్లూరు క్షేత్ర కార్యాలయం ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నెల్లూరు రంగనాయకుల పేటలోని పి.ఎం.ఆర్. మున్సిపల్ హైస్కూల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, తొలి రోజు నవాబు పేటలోని ఎం.సి.హెచ్.ఎస్. ప్రత్తి వారి పాఠశాల, పప్పుల వీధిలోని వై.వి.ఎం.సి.హచ్. స్కూల్ (సత్రం బడి)లోనూ మొక్కలను నాటారు. అనంతరం ఆసక్తి గల విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. వారధి ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి సంరక్షణ సహకారం అందిస్తుండగా, శుభమస్తు షాపింగ్ మాల్, పెరుమాళ్ సిల్క్స్ సహకారాన్ని అందిస్తున్నారు. లాయర్ పత్రిక, యాక్ట్ ఛానల్,…

Read more

  • July 24, 2024
  • 1 minute Read
వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో కంప్యూటరీకరణ వేగవంతం చెయ్యాలి

నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి): నెల్లూరు జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో కంప్యూటరీకరణ వేగవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ సహకారశాఖ అధికారులను ఆదేశించారు.జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టరు అధ్యక్షతన కలెక్టర్‌ ఛాంబర్‌లో బుధవారం జరిగింది. పిఎసిఎస్‌ల సామర్థ్యం, పారదర్శకత పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 78 పిఎసిఎస్‌లను నాబార్డు జాతీయ సాఫ్ట్‌వేర్‌ నెట్‌వర్కుకు అనుసంధానం చేసిందని, అందువల్ల కంప్యూటరీకరణ వేగవంతం చెయ్యాలని సూచించారు. జిల్లాలో 54 పిఎసిఎస్‌లలో 2,03,236 మెంబర్‌షిప్‌లు, 25,914 రికార్డులు అప్‌లోడ్‌ చేయడం జరిగిందన్నారు. మిగిలినవి కూడా సెప్టెంబరులోగా పూర్తి చెయ్యాలన్నారు. జిల్లాలో కొత్తగా మల్టీపర్పస్‌ డెయిరీ, సహకార, మత్స్య సహకార సంఘాల కంప్యూటరీకరణకు జిల్లా ప్రణాళిక…

Read more

  • July 24, 2024
  • 1 minute Read
తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరణ

ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గా బుధవారం ఉదయం శుభం భన్సల్ జిల్లా కలెక్టరేట్ నందు బాధ్యతలు స్వీకరించారు. 2020 బ్యాచ్ ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి జిల్లాలో జెసి గా పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. జెసి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, పలువురు జిల్లా అధికారులు,…

Read more

  • July 24, 2024
  • 1 minute Read
ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను

నెల్లూరు నూతన మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ ప్రభాతదర్శిని, (నెల్లూరు-కార్పొరేషన్ ప్రతినిధి): నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన కమిషనర్ మల్లవరపు సూర్య తేజ తెలిపారు. నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ గా బుధవారం ఆయన కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల సమక్షంలో పూర్ణ కుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పారదర్శకంగా పాలన అందించేందుకు కృషి చేస్తానని, ప్రజలనుంచి ప్రతిరోజూ అర్జీలు స్వీకరిస్తానని తెలిపారు. నగర పాలక సంస్థ నిర్దేశించిన…

Read more

  • July 24, 2024
  • 1 minute Read
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కి బీజేపీ నేతల విజ్ఞప్తి ప్రభాతదర్శిని,(కోట – ప్రతినిధి): గూడూరు డివిజన్లో ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను కోట, వాకాడు మండలాల కు చెందిన బిజెపి నాయకులు కోరారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిని సోమవారం విజయవాడలో మంత్రి చాంబర్లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వర రావు,తిరుపతి జిల్లా బిజెపి కోర్ కమిటీ నాయకులు దువ్వూరు గిరిధర్ రెడ్డి,తిరుపతి జిల్లా బిజెపి సీనియర్ నాయకులు పాదర్తి కోటారెడ్డి, కోట, మండలాలకు…

Read more

  • July 24, 2024
  • 1 minute Read
సాగు, త్రాగు నీటి సమస్యలు తీర్చండి సారూ….

కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలిసి.ఎం.చంద్రబాబు, మంత్రి లోకేష్ తో చర్చించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రభాతదర్శిని (కందుకూరు – ప్రతినిధి): కందుకూరు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లను కలిసి విన్నవించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు, సచివాలయంలో ఇద్దరినీ విడివిడిగా కలిసి వివిధ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. కందుకూరు ప్రాంత రైతుల సాగునీటి అవసరాలు తీర్చే రాళ్లపాడు రిజర్వాయరు కు, సోమశిల ప్రాజెక్టు నుంచి నీరు సక్రమంగా విడుదల కావడం లేదని నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రతి ఏటా సోమశిల నుంచి 1.5 టీఎంసీల నీరు విడుదల కావాల్సి…

Read more

  • July 24, 2024
  • 1 minute Read
తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సేవలో గవర్నర్ రాధాకృష్ణన్

ప్రభాతదర్శిని,(తిరుచానూరు-ప్రతినిధి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన తెలంగాణ జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్ రాధాకృష్ణన్ కు టిటిడి అధికారులు ఆలయం వద్ద స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టిటిడి అధికారులు గవర్నర్ కు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఆలయం వెలుపల గవర్నర్ కు బిజెపి నాయకుల గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బిజెపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బిజెపి తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బిజెపి యువమోర్చా నాయకులు దీపక్ యాదవ్ ,జయంత్…

Read more

error: Content is protected !!